పండగకు ఇంటికొస్తూ.. తండ్రీకొడుకుల మృతి

కర్నూలు: జిల్లాలోని ప్యాపిలి పోలీస్‌ సర్కిల్‌ పరిధిలోని చిగురుమానుమిట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం చిన్నఎక్కలూరు గ్రామానికి చెందిన శివరామిరెడ్డి(40) కొడుకు నర్సింహారెడ్డి(10) కోడూరు మండలం లబ్దగిరి గురుకుల పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు.

నర్సింహారెడ్డికి సంక్రాంతి సెలవులు ఇవ్వడంతో తండ్రీకొడుకులు మోటార్‌ బైక్‌పై స్వగ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యలో చిగురుమానుమిట్ట వద్ద వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో నర్సింహారెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, శివరామిరెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

A father and son died in a road accident

పల్లె వెలుగు బస్సు బోల్తా

చిత్తూరు జిల్లాలోని పెద్ద తిప్పసముద్రం మండలం మారుగానిపల్లె వధ్ద శుక్రవారం ఉదయం ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో బస్సులోని 10 మంది గాయపడ్డారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

బస్సు శుక్రవారం ఉదయం కర్ణాటక నుంచి మారుగానిపల్లె వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. హఠాత్తుగా బస్సు ముందు చక్రాలు ఊడిపోవడంతో కల్వర్టును ఢీకొని కాల్వాలో పడినట్లు తెలుస్తోంది. బస్సు కండిషన్ సరిగా లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు.

రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

విశాఖపట్టణం జిల్లా కసింకోట మండలం ఎంజిపాలెంలో జాతీయ రహదదారిపై వేగంగా వస్తున్న లారీ బైక్‌ను ఢీకొన్న సంఘటనలో ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+