వివాదం: యువతిపై మరో యువతి యాసిడ్ దాడి, తీవ్రగాయాలు

విశాఖపట్నం: జిల్లాలోని అక్కయ్యపాలెంలో బుధవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. యువతిపై మరో యువతి యాసిడ్‌తో దాడి చేసింది. ఇద్దరు యువతుల మధ్య ఏర్పడిన వివాదం కారణంగా ఓ యువతి యాసిడ్ దాడి చేసింది.

దాడిలో తీవ్రంగా గాయపడిన యువతిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

మహిళను బెదిరించి చోరీ

A girl allegedly poured acid on another girl

హైదరాబాద్: ఆహార భద్రతా కార్డుల విచారణకు వచ్చామని చెప్పి చోరీ చేసిన సంఘటన ఉప్పల్‌లోని ఆదర్శనగర్‌లో చోటు చేసుకుంది. ఆధార్ కార్డు చూపించాలని అడిగిన దుండగులు కార్డు కోసం మహిళ లోపలికి వెళ్లగానే ఆమె వెంటే ఇంట్లోకి వెళ్లి దాడికి పాల్పడ్డారు. మహిళను కత్తితో బెదిరించిన అగంతకులు ఆమె నుంచి బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

ఇది ఇలా ఉండగా హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కేసారం గ్రామం వద్ద బుధవారం ఉదయం డిసిఎం వ్యాను, బొలెరో వాహనం డీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

కృష్ణా నదిలో పుట్టి బోల్తా: ముగ్గురు గల్లంతు

కర్నూలు: జిల్లాలోని సంగమేశ్వర సమీపంలో కృష్ణా నదిలో పుట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మత్స్యకారులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+