వారంలో పెళ్లి: క్యాన్సర్ ఉందేమోనని యువతి ఆత్మహత్య

ఆదిలాబాద్ ఎస్ఐ జి రాము తెలిపిన ప్రకారం.. ఇందిరానగర్ కాలనీకి చెందిన పరమేశ్, లక్ష్మి దంపతులకు కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు కూతుళ్లు. పెద్ద కూతురికి ఇప్పటికే వివాహం చేశారు. రెండు కుమార్తె అపర్ణ (18) ఇంటర్మీడియట్ పూర్తి చేసింది.
కాగా, ఆదిలాబాద్ మండలంలోని అనుకుంటకు చెందిన యువకుడితో అపర్ణకు ఫిబ్రవరి 17న వివాహం నిశ్చయమైంది. మరో వారం రోజుల్లో పెళ్లి పెట్టుకుందామని కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పెళ్లి పనుల్లో భాగంగా అపర్ణ తల్లిదండ్రులు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయడానికి మార్కెట్‌కు వెళ్లారు.
మూడు రోజులుగా నోటి నుంచి రక్తం పడుతుండటంతో అపర్ణ ఆందోళనకు తీవ్ర గురైంది. తనకు బ్లెడ్ క్యాన్సర్ ఉందేమోనని భయంతో పెళ్లి చేసుకుని భర్త, అత్తామామలను ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు తన సూసైడ్ నోట్‌లో బాధితురాలు పేర్కొంది.












Click it and Unblock the Notifications