విజయవాడ-గూడూరు మధ్య మరో కొత్త రైల్వే లైన్.. పనులు మొదలు అప్పుడే!
భారతీయ రైల్వే, రైల్వే విస్తరణపై ప్రధానంగా దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా రైల్వే లైన్ల విస్తరణపైన ఫోకస్ చేస్తున్న రైల్వే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన ప్రత్యేకమైన దృష్టిని సారించింది. ఏపీలో పలు రైలు మార్గాలను అభివృద్ధి చేయడంతో పాటు అనేక రైళ్లను ఏపీకి అందిస్తోంది.. ప్రస్తుతం విజయవాడ గూడూరు మధ్య మూడవ లైను పనులు పూర్తి కాగా నాలుగో లైను నిర్మాణానికి అడుగులు వేస్తోంది.
ప్రయాణికుల మరియు సరుకు రవాణా రైళ్ల రద్దీ
విజయవాడ రైల్వే డివిజన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రధానమైన రైల్వే డివిజన్ గా మారింది. ఇక్కడినుండి సరుకు రవాణా ద్వారా భారీ ఆదాయం వస్తోంది. విజయవాడ రైల్వే డివిజన్ పైన ప్రయాణికుల మరియు సరుకు రవాణా రైళ్ల రద్దీ విపరీతంగా పెరిగింది. విశాఖపట్నం, హైదరాబాద్, విజయవాడల నుండి తిరుపతి, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లే అనేక రైళ్లకు, వందే భారత్ సర్వీసులకు ఈ మార్గం అత్యంత కీలకంగా ఉంది.

రోజుకు దాదాపు 175 సరుకు రవాణా రైళ్లు రాకపోకలు
ఇప్పటికే రైళ్ల రద్దీ ఎక్కువ కావడంతో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని 292 కిలోమీటర్లు ఈ మార్గంలో నాలుగో లైన్ కు ప్రతిపాదనలు వచ్చాయి. ప్రస్తుతం ఈ డివిజన్లో రోజుకు దాదాపు 175 సరుకు రవాణా రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. రద్దీని తగ్గించడానికి గతంలో 288 కిలోమీటర్ల మూడో రైల్వే లైన్ ను 3246 కోట్ల రూపాయలతో చేపట్టారు.
నాలుగో లైన్ కోసం పిల్లర్ లను వేసి విస్తరణ పనులు
దీనికి సంబంధించి పనులు ఆలస్యమైనప్పటికీ, ప్రస్తుతం అవి చివరి దశలో ఉన్నాయి. త్వరలోనే ఈ కొత్త లైన్ లో కూడా రైళ్లను అనుమతిస్తారు అని సమాచారం. ఇక మూడో లైన్ పనులప్పుడే వంతెనల వద్ద నాలుగో లైన్ కోసం పిల్లర్ లను వేసి విస్తరణ పనులను మొదలుపెట్టారు. మూడో లైన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే, నాలుగవ లైనుకు డిపిఆర్ ని సిద్ధం చేసి నిధులను సేకరిస్తారు.
నాలుగవ లైన్ పైన కూడా ఫోకస్
ఈ లైన్ పూర్తయితే సరుకు రవాణాతో పాటు ప్రయాణికుల రవాణా మెరుగయ్యే అవకాశం ఉంది. ఫలితంగా ఆదాయం కూడా బాగా పెరుగుతుంది అన్న అభిప్రాయం ఉంది. ఈ మార్గంలో నడిచే అదనపు రైళ్లకు కూడా అవకాశం లభిస్తుంది. ఈ అన్ని ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు నాలుగవ లైన్ పైన కూడా ఫోకస్ చేస్తున్నారు. త్వరలోనే మూడవ లైన్ అందుబాటులోకి వస్తే విజయవాడ గూడూరు మధ్య నాలుగవ లైన్ పనులు మొదలవుతాయి.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications