వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కంట కన్నీరు పెట్టించే ఘటన: గవర్నర్ ముందుకు మెర్సీ కిల్లింగ్ వినతి: విసిగిపోయిన ఒక మాతృమూర్తి..!!

|
Google Oneindia TeluguNews

ఇది..ఏ కన్న తల్లినైనా కలచి వేసే ఘటన. 19 ఏళ్లుగా కన్న పేగు బంధం ఆరోగ్యం కోసం పోరాడిన తల్లి దీన గాధ. అరుదైన మానసిక వ్యాధి సంఘర్షణ. ప్రభుత్వ ఆసుపత్రిలో కనిపించని మానవత్వం. కుమార్తెకు వైద్యం చేసేందుకు నిరాకరించిన మరో మహిళా డాక్టర్. ఇక్కడ మరో దీనమైన అంశం ఏంటంటే ఆ అరుదైన వ్యాధితో బాధ పడుతున్న యువతి తండ్రి అదే ప్రభుత్వాసుపత్రిలో చిరుద్యోగి. అయినా అక్కడ వైద్యులకు మాత్రం ఆ కుటుంబం పడుతున్న ఆవేదన మనసును కరిగించ లేదు. దీంతో.. ఆ మాతృమూర్తి స్వర్ణలత కన్న కూతురికి మెర్సీ కిల్లింగ్ ఇవ్వాలని గవర్నర్ ను అభ్యర్దించింది. ఏపీ రాజధాని విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.

ప్రభుత్వ ఆసుపత్రిలో కనిపించని మానవత్వం...
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో స్వర్ణలత అనే మహిళ తన కుమార్తెకు అరుదైన వ్యాధితో బాధ పడుతుంటే చికిత్స కోసం చేర్చారు. విజయవాడ సింగ్ నగర్ కు చెందిన గోరిపర్తి హచ్ మెన్..స్వర్ణలతలకు 2000 సంవత్సరంలో జన్మించిన స్వర్ణలత కుమార్తె జాహ్నవి నాలుగేళ్లకే అరుదైన మానసిక వ్యాధి తో ఇబ్బందులు మొదలయ్యాయి. ఆ తరువాత వ్యాధిని మల్టీ లొకేటెడ్ హైడ్రో కెపాలస్ అనే అరుదైన వ్యాధిగా వైద్యులు నిర్ధారించారు. దీని ద్వారా వంద శాతం మానసిక అంగవైకల్యం ఏర్పడింది. ఎనిమిదేళ్లకే జాహ్నవికి గైనిక్ పరమైన సమస్యలు ప్రారంభమయ్యాయి.

A lady file perition before Governor to accept mercy killing of her daughter

దీంతో..విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రిలోని గైనిక్ విభాగంలో చికిత్స అందిస్తున్నారు. అయితే, 2017లో అదే విభాగానికి మహిళా వైద్యురాలు హెడ్ ఆఫ్ ది డిపార్టమెంట్ గా వచ్చారు. అమె జాహ్నవికి చికిత్స అందించటానికి నిరాకరించారు. దీంతో స్వర్ణలత కోర్టుకు వెళ్లి తన పరిస్థితిని వివరించింది. తన కుమార్తెకు చికిత్స కొనసాగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్ధించింది. కోర్టు సైతం సానుకూలంగా స్పందించి.. చికిత్స అందించాలని ఆదేశించింది. అయినా.. కోర్టు ఆదేశాలను సైతం డాక్టర్లు పట్టించుకోలేదని స్వర్ణలత ఆరోపిస్తోంది. దీంతో.. జాహ్నవి పరిస్థితి చూసి తట్టుకోలేక మెర్సీ కిల్లింగ్ కు అనుమతి ఇవ్వాలంటూ స్వర్ణలత ఏపీ గవర్నర్ ను ఆశ్రయించింది.

బురద చల్లటానికే ఇదంతా ... నిరూపిస్తే ఆ 493 ఎకరాలు రాసిస్తా అంటున్న బాలయ్య చిన్నల్లుడు శ్రీ భరత్బురద చల్లటానికే ఇదంతా ... నిరూపిస్తే ఆ 493 ఎకరాలు రాసిస్తా అంటున్న బాలయ్య చిన్నల్లుడు శ్రీ భరత్


అదే ఆస్పత్రిలో ఉద్యోగి తండ్రి...
జాహ్నవి తండ్రి విజయవాడ ప్రభుత్వాసుత్రిలో చిరు ఉద్యోగిగా పని చేస్తున్నారు. ప్రభుత్వాస్పత్రిలో కుమార్తెకు వైద్యం చేయిస్తుంటే..అక్కడకు వచ్చిన మహిళా వైద్యురాలు ఇక వైద్యం కొనసాగించటానికి నిరాకరించారు. దీంతో..ఇంట్లో కుమార్తెను ఉంచుకోలేదక..బయట ప్రయివేటు వైద్యం అందించకలేక సతమతం అవుతున్నారు. అదే కుమార్తె బాధను చూడలేకపోతున్నారు. తమ కుమార్తకు నిరంతరం వైత్యం సాయం అవసరం కావటంతో..తమకు వైద్యం చేయించే శక్తి లేకపోవటంతో మెర్సీ కిల్లింగ్ కు అనుమతి తీసుకోవలని నిర్ణయించారు. తాను పని చేసే ఆస్పత్రిలో..అందునా ప్రభుత్వాసుపత్రిలోనే తన కుమార్తె కు వైద్యం చేయించలేని దీన స్థితిలో ఉన్న ఆ తండ్రి తన కుమార్తె బాధ చూడలేక..మెర్సీ కిల్లింగ్ కు వెళ్లటం మినహా మరో మార్గం లేదని నిర్ణయానికి వచ్చారు. దీంతో..జాహ్నవి తల్లి తండ్రులిద్దరూ ఇదే వ్యవహారం పైన ఏపీ గవర్నర్ కు వినతి పత్రం అందించారు. ఈ మెర్సీ కిల్లింగ్ వినతి ఘటన విజయవాడ నగరంలో సంచలనంగా మారింది.

English summary
A lady file perition before Governor to accept mercy killing of her daughter who suffering with pshycological problem since 15 years. Her daughter taking treatement in vijayawada govt hospital. But, now dcotros reected her for continue of treatment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X