తెలీదు, గుర్తులేదు, జోగి రమేష్ నోట ‘జూనియర్ ఎన్టీఆర్’ అదుర్స్ డైలాగ్ లు

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు జోగి రమేష్ పోలీసులకి జూనియర్ ఎన్టీఆర్ అదుర్స్ సినిమా చూపిస్తున్నాడు. పోలీసులు అడిగిన ప్రశ్నలకి మాజీ మంత్రి జోగి రమేష్ తనకు ఏమీ తెలీదు, గుర్తులేదు అంటూ అదుర్స్ సినిమాలో డైలాగులు చెప్పడంతో పోలీసులు సహనం కోల్పోయారని సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ నటించిన అదుర్స్ సినిమాలో హీరో పిచ్చ కామిడీ చేసిన విషయం తెలిసిందే.

అదుర్స్ సినిమాలో విలన్ అడిగే ప్రశ్నలకు హీరో ఎన్టీఆర్ తెలియదు, గుర్తులేదు అనే డైలాగ్ లు చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. అదుర్స్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కామెడీ చేసినట్లు ఇప్పుడు మాజీ మంత్రి జోగి రమేషష్ కూడా పోలీసుల ముందు కామిడీ చేస్తున్నారని తెలిసింది. వైసీపీ నాయకుడు జోగి రమేష్ కూడా పోలీసులు అడిగే ప్రశ్నలకి తెలియదు, గుర్తులేదు అని కామెడీ చేస్తున్నాడని పోలీసుల తరపున న్యాయవాది సిద్దార్థ లూధ్రా కోర్టుకు చెప్పారు.

A lawyer told the court that YCP leader Jogi Ramesh was quoting movie dialogues

2021లో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంపై మూకుమ్మడిగా దాడి జరిగింది. చంద్రబాబు నివాసంపై జరిగిన దాడి కేసులో మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు జోగి రమేష్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఈకేసుకు సంబంధించి పోలీసులు మూడుసార్లు మాజీ మంత్రి జోగి రమేష్ కి నోటీసులు జారీ చేశారు. ఇటీవల పోలీసుల విచారణకు హాజరైన జోగి రమేష్ పోలీసులకు అదుర్స్ సినిమా చూపించారని పోలీసులు అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తో కలిసి మంగళగిరి పోలీసులు ముందు విచారణకు హాజరైన మాజీ మంత్రి జోగి రమేష్ పోలీసులు అడిగిన ప్రశ్నలకి తనకు ఏమీ తెలియదు, గుర్తులేదు అనే డైలాగులు చెప్పారని పోలీసుల తరపు న్యాయవాది సిద్ధార్థ లూధ్రా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు చెప్పారు. పోలీసులు మాజీ మంత్రి జోగి రమేష్ ను ప్రశ్నిస్తుంటే ఆయన పక్కనే కుర్చున్న మాజీ అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి పోలీసులు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పారని పోలీసుల తరపు న్యాయవాది సిద్ధార్థ లూధ్రా కోర్టుకు చెప్పారు.

ఆ సందర్భంలో చిత్రీకరించిన వీడియోని మీరు పరిశీలించాలని సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూధ్రా కోర్టుకు మనవి చేశారు. మాజీ మంత్రి జోగు రమేష్ ని ప్రశ్నిస్తున్న సమయంలో మాజీ అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి సమాధానం చెబుతున్న సమయంలో తీసిన వీడియోని పోలీసుల తరపు న్యాయవాది సిద్ధార్థ లూధ్రా కోర్టుకు సమర్పించారు. చంద్రబాబు ఇంటి పై దాడి జరిగిన సమయంలో మాజీ మంత్రి జ్యోతి రమేష్ వినియోగించిన సెల్ ఫోన్. సిమ్ కార్డ్ నెంబర్, ఐఎంఈఐ నంబర్, ఫోన్ బిల్లులు తదితర వివరాలను ఇవ్వాలని వైసీపీ నాయకుడు జోగి రమేష్ కు పోలీసులు సూచించారు.

అయితే పోలీసులు అడిగిన వివరాలకు మాజీ మంత్రి జోగి రమేష్ ఇంతవరకు స్పందించలేదని, ఏ ప్రశ్నలు అడిగినా తెలియదు, గుర్తులేదు అంటూ సమాధానాలు చెబుతూ పోలీసుల విచారణకు సహకరించడం లేదని పోలీసుల తరపు న్యాయవాది సిద్ధార్థ లూధ్రా కోర్టుకు చెప్పారు. మాజీ మంత్రి జోగి రమేష్ బెయిల్ పిటిషన్ సంబంధించి వాదనలు వినిపిస్తున్న సీనియర్ లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అదే జోగి రమేష్ వెంట పోలీసుల విచారణకు హాజరై దర్యాప్తు కి ఆటంకం కలిగిస్తున్నారని సిద్ధార్థ లూధ్రా కోర్టుకు చెప్పారు.

A lawyer told the court that YCP leader Jogi Ramesh was quoting movie dialogues

నిందితుడి పక్కన కూర్చున్న న్యాయవాది పోలీసులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం గతంలో తాను ఎన్నడూ కూడా చూడలేదని సిద్ధార్థ లూధ్రా కోర్టుకు చెప్పారు. చంద్రబాబు ఇంటిపై కుట్రపూరితంగానే దాడి జరిగిందని, అప్పటి వైసీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసిందని, ఆనాటి వైసీపీ ప్రభుత్వం కొందరి మీద కావాలనే ఎస్సీ, ఎస్టీ యాక్టు కేసులు నమోదు చేసిందని పోలీసుల న్యాయవాది కోర్టుకు చెప్పారు.

ఈ కేసుల దర్యాప్తు నీరుకార్చేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసులు తరపున న్యాయవాది సిద్దార్థ లూధ్రా కోర్టుకు చెప్పారు. కేసు విచారణ జరుగుతున్న సమయంలో మాజీ మంత్రి జోగి రమేష్ కు బెయిల్ మంజూరు చేస్తే కేసు దర్యాప్తు పక్కదారి పట్టే అవకాశం ఉందని, ఆయనకు బెయిల్ మంజూరు చేయకూడదని పోలీసుల తరపు న్యాయవాది సిద్ధార్థ లూధ్రా కోర్టుకు మనవి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+