ముంచుకొస్తున్న మరో తుఫాను ముప్పు, ఈ జిల్లాలపై ప్రభావం - తాజా అలర్ట్స్..!!

వాతావరణ శాఖ మరో కీలక అప్డేట్ ఇచ్చింది. మొంథా బీభత్సాన్ని మరువక ముందే మరో తుఫాను అలర్ట్ జారీ అయింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 19న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని భారత వాతావరణశాఖ తెలిపింది. పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ.. మరింత బలపడే అవకాశం ఉన్నదని, వాయుగుండంగా బలపడనుందని అంచనా వేసింది. ఈ అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో 15 నుంచి తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

వాతావరణ శాఖ కీలక సమాచారం వెల్లడించింది. ఈ నెల 19 లేదా 20వ తేదీన దక్షిణ అండమాన్‌ సముద్రం/ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. తర్వాత పశ్చిమంగా పయనించే క్రమంలో ఇది బలపడి తుఫాన్‌గా మారుతుందని వెల్లడించారు. కాగా, ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా దిశగా రానుందని అంచనావేశారు. దక్షిణ కోస్తా జిల్లాలపై దీని ప్రభావం ఉంటుందని విశ్లేషించారు. దీని కంటే ముందుగా మరో నాలుగైదు రోజుల్లో శ్రీలంక సమీపంలో అల్పపీడనం ఒకటి ఏర్పడి దక్షిణ తమిళనాడు దిశగా వస్తున్నట్టు వాతావరణ మోడళ్లు అంచనా వేస్తున్నాయి. రానున్న రెండు, మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసి, ఆ తర్వాత వాతావరణం పొడిగా ఉంటుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అధికారి తెలిపారు.

a-low-pressure-area-is-likely-to-form-over-the-bay-of-bengal-during-june-13-17

కాగా, రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఆకాశం నిర్మలంగా మారి పొడి వాతావరణం నెలకొంది. దక్షిణ భారతం పైకి చలిగాలులు వీస్తుండటంతో ఆదివారం కోస్తా, రాయలసీమల్లో చలి తీవ్రత బాగా పెరిగింది. పాడేరు ఏజెన్సీ, తెలంగాణకు ఆనుకుని ఉన్న మధ్యకోస్తా, రాయలసీమలోని కొన్నిచోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు తక్కువగా నమోదయినట్లు వెల్లడించారు. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచింగి పుట్టులో 14.4, డుంబ్రిగుడ లో 14.7, పెదబయలులో 15.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అల్లూరి సీతారామరాజు, అన్నమయ్య, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, శ్రీసత్యసాయి, నంద్యాల, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 17 డిగ్రీల లోపు నమోదు అవుతున్నాయి. ఇక.. రాష్ట్రంలోని పలు ప్రాంతా ల్లో ఈ నెల 17, 18 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించారు. దీని ప్రభావం రాష్ట్రం పై పెద్దగా ఉండబోదని నిపుణులు అంచనా వేస్తున్నా.. వర్షాలు మాత్రం కురుస్తాయని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+