అమ్మాయి పుట్టిందని భార్యను ఇంట్లోకి రానివ్వని ప్రబుద్ధుడు

అనంతపురం: ఆడపిల్ల పుట్టిందని భార్యను ఇంట్లోకి రానివ్వకుండా హింసిస్తున్నాడు ఓ ప్రబుద్ధుడు. అతడు బాధ్యతగల ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతుండటం గమనార్హం. ఈ ఘటన అనంతపురం జిల్లాలోని కదిరిలో సోమవారం చోటు చేసుకుంది.

కదిరిలో నివాసముంటున్న హరినాథ్‌రెడ్డి, శ్రీలత దంపతులకు కొన్ని రోజుల క్రితం ఆడబిడ్డ పుట్టింది. ఆడపిల్లలంటే ఇష్టం లేని హరినాథ్‌రెడ్డి బిడ్డ పుట్టిన దగ్గర్నుంచి శ్రీలతకు చిత్రహింసలు పెడుతున్నాడు. శ్రీలతను ఇంట్లోకి రానివ్వకుండా హరినాథ్ అడ్డుకున్నాడు. దీంతో శ్రీలత భర్త ఇంటి ఎదుట ధర్నాకు దిగింది.

A man has harassed his wife in Anantapur district

ఏడో తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

పశ్చిమగోదావరి జిల్లాలోని పెరవలి మండలం పిట్టలవేమవరంలో జడ్పీ హైస్కూల్‌లో ఏడో ఏడో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటనే ఆ బాలికను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. తోటి విద్యార్థి వేధింపులే కారణమని బంధువుల పాఠశాలలో ఆందోళన చేశారు.

భార్యాభర్తల మధ్య ఘర్షణ... భర్త ఆత్మహత్య

కర్నూలు: జిల్లాలోని మంత్రాలయం మండలం పి.తండాలో భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణతో మనస్తాపానికి గురైన భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+