నేడు ఆకాశంలో అద్భుతం: ప్రకాశవంతంగా సూపర్ మూన్!!
ఆకాశంలో ఈరోజు అద్భుతమైన దృశ్యం ఆవిష్కరణ కానుంది. గగనతలంలో ఈరోజు సూపర్ మూన్ కనువిందు చేయనుంది. 2023 లో ముఖ్యమైన నాలుగు సూపర్ మూన్ లు ఆవిష్కృతం అవుతుండగా, మొదటిది జూలై 3 వ తేదీన అంటే నేడు సంభవించనుంది అని శాస్త్రవేత్తలు తెలిపారు.
సాధారణ రోజులతో పోల్చుకుంటే ఈ రోజు చంద్రుడు చాలా ప్రకాశవంతంగా, భూమికి చేరువగా రానున్నాడు. భూమికి చంద్రుడికి మధ్య దూరం 3,82,900 వందల కిలోమీటర్లు ఉంటే కానీ నేడు సూపర్ మూన్ రోజున మాత్రం 3,61,934 కిలోమీటర్లు మాత్రమే భూమికి, చంద్రునికి మధ్య దూరం ఉంటుంది. జులైలో నేడు కనిపించనున్న సూపర్ మూన్ ను బక్ మూన్ అని కూడా అంటారు.

ఈ రోజు చంద్రుని చూడాలంటే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే చూడవచ్చని ఖగోళ పరిశోధకులు చెబుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ రోజు సాయంత్రం ఐదు గంటల ఎనిమిది నిమిషాలకు సూపర్ మూన్ కనువిందు చేయనుంది అని చెబుతున్నారు. సాధారణంగా ప్రతి రోజూ మనకు కనిపించే చంద్రుడి కంటే ఈ రోజు చంద్రుడు ఏడు శాతం పెద్దగా కనిపిస్తాడని చెబుతున్నారు.
సాధారణంగా జులై మాసంలో మగ జింక కొమ్ములు రాలడం తిరిగి పెరగడం జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో సూపర్ మూన్ ను బక్ మూన్ అంటారు. మొత్తం 2023లో 4 సూపర్ మూన్ లు రానున్నాయి. సహజంగా ప్రతి సంవత్సరం సంవత్సరానికి పన్నెండు పౌర్ణమిలు ఏర్పడతాయి. కానీ ఈ సంవత్సరం 13 పౌర్ణమి లు సంభవించనున్న టు శాస్త్రవేత్తలు తెలిపారు.
ఇక ఆగస్టు నెలలో రెండు కనువిందు చేయనున్నాయి. ఆగస్టు 1న స్టర్జన్ మూన్, ఆగస్టు 30న బ్లూ మూన్, సెప్టెంబర్ 29న హార్వెస్ట్ మూన్, అక్టోబర్ 28వ తేదీన హంటర్ మూన్, నవంబరు 27న బీవర్ మూన్, డిసెంబర్ 26న కూల్ మూన్ పేరుతో సూపర్ మూన్స్ ఏర్పడతాయని సమాచారం. ఇక నేడు కనువిందు చెయ్యనున్న సూపర్ మూన్ ను చూసి ఎంజాయ్ చెయ్యండి.












Click it and Unblock the Notifications