చంద్రబాబు కోసం సిద్ధమైన కొత్త కాన్వాయ్?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జూన్ 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ప్రమాణ స్వీకారం కోసం గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో చంద్రబాబు కోసం కొత్త కాన్వాయ్ కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది.

11 వాహనాలతో చంద్రబాబు కొత్త కాన్వాయ్
తాడేపల్లిలోని ఇంటెలిజెన్స్ కార్యాలయం వద్ద మొత్తం 11 వాహనాలతో చంద్రబాబు కొత్త కాన్వాయ్ సిద్ధంగా ఉంది. ఈ వాహనాలలో రెండింటిని సిగ్నల్ జామ్ వర్క్ కోసం కేటాయించారని ప్రచారం జరుగుతుంది. టయోటా కంపెనీకి చెందిన నలుపు రంగు వాహనాలకు 393 చంద్రబాబు లక్కీ నెంబర్ తో సిద్ధమయ్యాయని సమాచారం. అయితే దీనిని అధికారికంగా ధ్రువీకరించలేదు. అయితే మరోవైపు పాత వాహనాలనే వినియోగించనున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి.

A new convoy ready for Chandrababu

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు
మరోవైపు జూన్ 12వ తేదీ ఉదయం 11 గంటల 27 నిమిషాలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమానికి భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు హాజరవుతారు, కేసరపల్లి ఐటి పార్క్ ప్రధానవేదికతో పాటు విఐపి, వీవీఐపీ మరో ప్రత్యేక గ్యాలరీలను కూడా ఏర్పాటు చేసి అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

లక్ష మంది హాజరై తిలకించేలా ఏర్పాట్లు
మొత్తం 11 ఎకరాల స్థలంలో లక్ష మంది హాజరై చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ వేడుకను తిలకించేలాగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వర్షాకాలం కావడంతో వర్షం పడినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా టెంట్లు వేస్తున్నారు. ప్రత్యేకంగా షెడ్లను నిర్మిస్తున్నారు. అంతేకాదు సభా ప్రాంగణంతో పాటు బయట కూడా ఎల్ఈడి స్క్రీన్ లను ఏర్పాటు చేసి చంద్రబాబు ప్రమాణ స్వీకార ప్రత్యక్ష ప్రసారాన్ని చేయనున్నారు.

కట్టుదిట్టమైన భద్రత మధ్య చంద్రబాబు ప్రమాణ స్వీకారం
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యే వీఐపీలు వీఐపీలు ప్రముఖుల కోసం విజయవాడలో ఉన్నటువంటి పెద్ద పెద్ద హోటల్స్ అన్నింటిని బుక్ చేశారు.మొత్తం పదివేల మంది భారీ బందోబస్తుతో చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేసిన అధికారులు చంద్రబాబు నివాసం నుంచి ప్రమాణ స్వీకార వేదిక వరకు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ కార్యక్రమానికి వస్తున్న క్రమంలో ఎస్పీజీ టీం ఇప్పటికే విజయవాడ చేరుకుని అక్కడ ట్రయల్ నిర్వహించి తీసుకోవలసిన జాగ్రత్తలపై కొన్ని సూచనలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+