వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Fish: మత్స్యకారులకు చిక్కిన కచ్చిడి చేప.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాసిందే..

|
Google Oneindia TeluguNews

రెండు నెలల విరామం తర్వాత చేపలకు వేటకు వెళ్తున్న మత్స్యకారుల వలకు వివిధ రకాల చేపలు చిక్కుతున్నాయి. అందులో కొన్నింటికి భారీ ధర పలుకుతోంది. అంతర్వేది పల్లిపాలెం మత్స్యకారులకు చిక్కిన ఓ చేప భారీ ధర పలికింది. అటు సూర్యరావుపేట ఎన్టీఆర్ బీచ్ కు భారీ చేప కొట్టుకొచ్చింది. అయితే ఇది చనిపోయి తీరానికి కొట్టుకొచ్చింది.

2 లక్షలు

2 లక్షలు

కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం మినీ హార్బర్ లో మచిలీపట్నంకి చెందిన మత్స్యకారుల వలకు 23 కిలోల మగ కచ్చిడి చేప చిక్కింది. దీనిని స్థానిక మార్కెట్ లో విక్రయించగా రెండు లక్షల రూపాయలు పలికింది. స్థానిక చేపల వ్యాపారి రెండు లక్షలకు కొనుగోలు చేశారు.దీనిలో ఉండే పొట్ట భాగం ఔషదం తయారీకి వినియోగిస్తారని అందుకే ఈచేపకు అంత ధర ఉంటుందని వారు వెల్లడించారు. రెండు నెలలు చేపల వేట విరామం తర్వాత ఈ చేపలు చిక్కడంతో గంగ పుత్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

బొక్కు సొర్ర చేప

బొక్కు సొర్ర చేప

కాకినాడ జిల్లా సూర్యరావుపేట ఎన్టీఆర్ బీచ్ కు అల్పపీడ ద్రోణి కారణంగా అరుదైన బొక్కు సొర్ర చేప ఒడ్డుకు కొట్టుకు వచ్చింది . ఇది మత్స్యకారుల వలకు చిక్కి చనిపోయినట్లు తెలుస్తుంది. సుమారు 25 అడుగుల పొడుగు, బరువు 3 టన్నులు వరకు ఉండవచ్చునని మత్స్యకారులు చెబుతున్నారు.బోక్కు సొర్ర చేప పూర్తిగా శాకాహారి. సముద్రంలో ఉండే నాచు మాత్రమే తింటుంది.

నీటిని శుద్ధి చేస్తుంది

నీటిని శుద్ధి చేస్తుంది

ఇది సముద్రంలో జీవిస్తూ సముద్రపు నీటిని పొల్యూషన్ లేకుండా శుద్ధి చేస్తుందనీ మత్స్యకారులు చెబుతున్నారు. సముద్రంలో స్నానం చేస్తున్న కొంతమంది యాత్రికులు చనిపోయిన ఈ చేప పైకి ఎక్కి విన్యాసాలు చేస్తూ ఇంత పెద్ద చేప చూడటం ఇదే మొదటి సారి అంటూ ఆనందాన్ని వ్యక్త చేస్తున్నారు.

English summary
A 23 kg male kachidi fish was caught in the net of Machilipatnam fishermen in Antarvedi Pallipalem mini harbor of Konaseema district Sakhinetipalli mandal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X