మాతృత్వం కోసం పరితపించిన తల్లికి అరుదైన కాన్పు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ జిల్లాలో ఒక అరుదైన కాన్పు చేశారు ఒక ప్రైవేట్ ఆస్పత్రిలోని వైద్య బృందం. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం శారద నర్సింగ్ హోమ్ లో డాక్టర్ గిరిబాల, డాక్టర్ శ్రావ్య, బృందంతో కలిసి ఒకే కాన్పు లో ఇద్దరు మగ పిల్లలు ఒక ఆడపిల్లకు పురుడు పోశారు. ముగ్గురు పిల్లలు పుట్టే అరుదైన కాన్పు కు శస్త్ర చికిత్స నిర్వహించారు.
ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు
రాజనగరం మండలం పాత తుంగపాడు గ్రామానికి చెందిన ఆలపాటి సంధ్యా కుమారికి, వీరబాబు దంపతులకు పెళ్లయి ఐదు సంవత్సరాలు అయినా గర్భవతి కాలేదు. పిల్లలు లేరని చాలా ఆస్పత్రులు తిరిగిన ఈ దంపతులకు అదృష్టం ముగ్గురు పిల్లలను ఒకే కాన్పులో ఇచ్చింది.

మాతృత్వం కోసం అల్లాడిన తల్లికి గర్భం
గర్భం దాల్చాలని కోరికతో పిల్లల మీద ఆసక్తి తో ఎన్నో హాస్పటల్లో వైద్యం చేయించుకున్న సంధ్య కుమారి గర్భవతి కాలేదు. చివరికి రామచంద్రపురం బ్రాడీపేట లో ఉన్న శారద నర్సింగ్ హోమ్ లో డాక్టర్ గిరిబాల వద్ద పరీక్షలు చేయించుకుని మందులు వాడారు. దీంతో సంధ్య కుమారి గర్భం దాల్చింది. గర్భవతి అయిన సంధ్య కుమారికి గర్భంలో కవలలు కాదు ముగ్గురు పిల్లలు ఉన్నారని వైద్యులు గుర్తించారు.
ఇద్దరు మగ పిల్లలకు ఒక ఆడపిల్లకు పురుడు
ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేసి ఇద్దరు మగ పిల్లలకు ఒక ఆడపిల్లకు పురుడు పోశారు వైద్యులు. ఆ ముగ్గురు పిల్లలు ఆరోగ్యంగా ఉండవలసిన బరువుతో పుట్టారని తల్లి పిల్లలు క్షేమంగానే ఉన్నారని డాక్టర్ గిరిబాల తెలిపారు. పిల్లలు పుట్టాలని ఎన్నో హాస్పిటల్స్ తిరిగి అలసిపోయి నిరాశ చెందిన ఆ దంపతులకు, శారద నర్సింగ్ హోమ్ డాక్టర్ గిరిబాల వైద్యం పిల్లలను ఇచ్చింది.
ఒకే దెబ్బకు ముగ్గురు పిల్లల తల్లిగా మహిళ
పిల్లలు పుట్టేలా మంచి వైద్యం అందించి డెలివరీ కూడా చేయటంతో వీరబాబు సంధ్య కుమారి దంపతులకు కుటుంబ సభ్యులకు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తల్లి కావాలనుకున్న ఆ మహిళ ఒకే దెబ్బకు ముగ్గురు పిల్లల తల్లిగా మారింది. ఈ విషయం తెలిసిన వారంతా ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు పుట్టిన అరుదైన ఘటన, అందులోనూ మాతృత్వం కోసం పరితపించిన తల్లికి ముగ్గురు సంతానం ఒకే కాన్పులో కలగటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications