విద్యార్థినిపై లైంగిక వేధింపులు: హెచ్ఎంకు దేహశుద్ధి

ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు బాలిక తెలపడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాఠశాల ఎదుట ఆందోళన చేశారు. ప్రధానోపాధ్యాయుడు బ్రహ్మాజీకి దేహశుద్ధి చేసిన గ్రామస్తులు, ఆ తర్వాత అతన్ని పోలీసులకు అప్పగించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితునిపై కేసు నమోదు చేసుకున్నారు.
అనుమానంతో దంపతుల ఆత్మహత్య
మహబూబ్‌నగర్: అనుమానం కారణంగా తరచూ గొడవలు పడుతూ మనస్తాపానికి గురైన దంపతులు క్షణికావేశంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాధ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలోని లింగాలలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పెద్దకొత్తపల్లి మండలం పెద్దకారుపాములకు చెందిన గౌరమ్మ (22)కు, లింగాల గ్రామానికి చెందిన కృష్ణయ్య (26)కు 2013, మే నెలలో వివాహమైంది.
పెళ్లిన కొత్తలో ఇద్దరూ కూలీ పని చేసుకుంటూ అన్యోన్యంగానే జీవనం కొనసాగించారు. గత కొంత కాలం నుంచి కృష్ణయ్య భార్య గౌరమ్మపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఆమెతో తరచూ గొడవ పడుతూ ఉండేవాడు. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 21న గౌరమ్మ తన పుట్టింటికి వెళ్లింది. గత ఆదివారం సాయంత్రం తన భార్యను తీసుకొని వచ్చేందుకు కృష్ణయ్య అత్తగారింటికి వెళ్లాడు.
ఆ తర్వాత ఇద్దరూ కలిసి తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలోని దేదినేనిపల్లి రోడ్డు పక్కన ఉన్న ఓ చెట్టుకు తాడుతో ఉరివేసుకున్న దంపతులు ప్రాణాలు తీసుకన్నారు. వీరిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, దంపతులిద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నాగర్ కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. వివాహమై ఏడాది కాకుండానే దంపతులు తనువు చాలించడంతో ఇరుకుటుంబాల్లో విషాధం అలుముకుంది.












Click it and Unblock the Notifications