తాగిన మైకంలో తల్లిదండ్రులను హత్య చేసిన కొడుకు

బాలుడి కిడ్నాప్, హత్యాయత్నం
విశాఖపట్నం: జిల్లాలోని సింధియా మండలంలోని గణపతినగర్‌కు చెందిన హేమంత్(6) అనే బాలుడిని అదే గ్రామానికి చెందిన నాగేశ్వర్ రావు అనే యువకుడు కిడ్నాప్ చేశాడు. అనంతరం బాలుడ్ని హత్య చేసేందుకు యత్నించాడు. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి, కనకరాజు దంపతుల కుమారుడు హేమంత్‌ను పాత కక్షల కారణంగా గ్రామానికి చెందిన నాగేశ్వరరావు అనే యువకుడు సోమవారం పాఠశాల సమీపంలో కిడ్నాప్ చేశాడు.
అనంతరం గ్రామ శివారులో రాయితో బాలుడి తలపై మోదాడు. బాలుడు స్పృహ తప్పిపోవడంతో చనిపోయాడని భావించిన నాగేశ్వరరావు అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. బాలుడి కోసం గాలించిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గాయాలతో పడివున్న బాలుడ్ని చూసి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. బాలుడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.
కారు బోల్తా: దంపతులు మృతి
మహబూబ్‌నగర్: జిల్లాలోని జడ్చర్ల మండలం గొల్లపల్లి సమీపంలో ప్రమాదవశాత్తు కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న దంపతులు మృతి చెందారు. మృతులు హైదరాబాద్ నగరానికి చెందిన వారుగా గుర్తించారు.












Click it and Unblock the Notifications