Strange Creature in Nellore : నెల్లూరు జిల్లాలో వింత జీవి కలకలం... భోజనం ప్లేట్‌లో ప్రత్యక్షం...
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఓ వింత జీవి ప్రత్యక్షమైంది. పడమటి నాయుడుపల్లిలోని ఓ ఇంట్లో దారపు పోగు లాంటి ఓ అరుదైన జీవి కనిపించింది.ఇది ఎక్కడి నుంచి వచ్చిందో... ఎలా వచ్చిందో తెలియట్లేదని ఆ ఇంటి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇది విషపూరితమా లేక సాధారణ ప్రాణినా అన్నది అంతుచిక్కడం లేదన్నారు.
ఆ ఇంటి కుటుంబ సభ్యుడొకరు మాట్లాడుతూ... తన సోదరుడు భోజనం చేసిన ప్లేట్‌లో ఈ జీవి ప్రత్యక్షమైందని చెప్పాడు. అన్నం తిన్నాక చేయి కడుక్కొని ఆ ప్లేట్‌ను పక్కన పెట్టాడని... కాసేపటికి అందులో ఆ వింత జీవిని మొదట తమ వదిన గుర్తించిందని చెప్పాడు. ఏంటా అని చూస్తే.. దారం పోగులా ఉన్న ఓ జీవి అందులో కదలాడుతూ కనిపించిందన్నాడు. పుల్లతో దాన్ని తాకే ప్రయత్నం చేస్తే ముడుచుకుపోతోందని తెలిపాడు.

అది విషపూరితమైనది కావొచ్చునని తమ కుటుంబ సభ్యులు భయాందోళనకు గురువుతున్నారని వాపోయాడు. దాన్ని చంపేసేందుకు హీటర్ పెట్టినా అది చావలేదని చెప్పాడు. దీంతో మరింత ఆశ్చర్యపోయామని... ఆ జీవి ఏంటో ఎక్కడినుంచో వచ్చిందో అర్థం కావట్లేదన్నారు. సంబంధిత అధికారులు దీనిపై స్పందించి ఆ జీవి ఏంటో కనిపెట్టాలన్నారు. ఆ నోటా ఈ నోటా ఈ విషయం ఊరంతా పాకడంతో గ్రామస్తులంతా ఆ జీవిని చూసేందుకు ఎగబడుతున్నారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఆ జీవి ఏంటన్నది తెలియక నెటిజన్లు కూడా జుట్టు పీక్కుంటున్నారు.
Recommended Video

గతంలోనూ పలుచోట్ల ఇలా వింత జీవులు కలకలం రేపిన సంగతి తెలిసిందే. మూడేళ్ల క్రితం విశాఖపట్నంలోనూ వింత జంతవులు ప్రత్యక్షమయ్యాయంటూ జోరుగా ప్రచారం జరిగింది. అచ్చు మనుషుల్లాగే కదులుతున్నాయని... చూసేందుకు వింతగా ఉన్నాయని ప్రచారం చేశారు. చివరకు వాటిని గుడ్ల గూబలుగా అధికారులు నిర్దారించారు. కాగా,ఈ అనంత విశ్వంలో మనిషి గుర్తించని,మనిషి దృష్టిలో పడని వింతలు,విశేషాలు ఎన్నెన్నో ఉండవచ్చునన్న అభిప్రాయాలు లేకపోలేదు.












Click it and Unblock the Notifications