గ్వాలియర్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం: పడవ బోల్తాపడి 5గురు మహిళల గల్లంతు
గ్వాలియర్/హైదరాబాద్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్‌లోని ఐఐఐటిలో మూడో ఏడాది చదువుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థి ప్రవీణ్ కుమార్ అదృశ్యమయ్యాడు. విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు గ్వాలియర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రవీణ్ కుమార్ స్వస్థలం విశాఖపట్నం జిల్లాలోని మద్దిలపాలెం.
నాటు పడవ బోల్తా: ఐదుగురు మహిళలు గల్లంతు
విశాఖపట్నం: జిల్లాలోని ముంచంగిపుట్టు మండలం జోగిగుమ్మలో నాటు పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళలు గల్లంతయ్యారు. వారి కోసం గాలిస్తున్నారు.
యువతి కిడ్నాప్‌కు క్యాబ్ డ్రైవర్ విఫలయత్నం

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో ఉద్యోగానికి వచ్చిన ఓ యువతిని అపహరించేందుకు క్యాబ్ డ్రైవర్ ప్రయత్నించాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో భయపడిన క్యాబ్ డ్రైవర్ ఆమెను రింగ్ రోడ్డుపై వదిలి వెళ్లిపోయాడు.
తనను ఓ క్యాబ్ డ్రైవర్ కిడ్నాప్ చేయబోయాడని బాధిత యువతి తెలిపింది. తనను తాను రక్షించుకునేందుకు 100కు డయల్ చేసి సమాచారం అందించినట్లు చెప్పింది. దానిని పసిగట్టిన డ్రైవర్ అప్రమత్తమై తనను అప్పా జంక్షన్ వద్ద రింగురోడ్డుపై వదిలేసి వెళ్లినట్లు వెల్లడించింది.
నకిలీ ఎస్ఐ, ఐపిఎస్ భార్యాభర్తలు అరెస్ట్
తాము ఎస్ఐ, ఐపిఎస్ అధికారులమంటూ మోసాలకు, దోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరు దంపతులను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. నకిలీ ఎస్ఐ భరత్, ఐపిఎస్ చెలామణి అవుతున్న అతని భార్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications