బంగారం, ఫోన్లు, బైకులు, కార్లు కనబడితే అంతే: ఘరానా దొంగ అరెస్ట్(పిక్చర్స్)
విశాఖపట్నం: ఓ ఘరానా దొంగను విశాఖ త్రీటౌన్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. 11 కేసుల్లో నిందితుడైన ఆ దొంగను శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అతని వద్ద నుంచి 450 గ్రాముల బంగారం, కేజీన్నర వెండి సామాగ్రి, యాపిల్ ఐపాడ్, ఐఫోన్, మారుతి వేగనార్ కారు, మూడు బైకులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీస్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నగర క్రైం డిసిపి టి రవికుమార్ మూర్తి ఈ మేరకు వివరాలను వెల్లడించారు. విజయనగరం జిల్లా బలిజిపేట మండలం గాంగాడ గ్రామానికి చెందిన మామిడి తిరుపతిరావు ఇంటర్ వరకు చదువుకున్నాడు. శ్రీకాకుళం జిల్లా రాజాం జీఎంార్ కాలేజీలో చదువుకున్న రోజుల్లో జల్సాలకు అలవాటు పడ్డాడు. అప్పట్నుంచే బైకులు దొంగతనం చేయడం ప్రారంభించాడు.
2007లో విశాఖ చేరుకున్న తిరుపతిరావు.. వరుస దొంగతనాలకు పాల్పడేవాడు. 2011లో మాల్కాపురానికి చెందిన సందీప్ అనే వ్యక్తి వద్ద డ్రైవర్‌గా పని చేస్తూ.. అతనితో ఘర్షణ పడి రాయితో కొట్టి చంపాడు. ఈ కేసులో అరెస్ట్ అయి, బెయిల్‌పై విడుదలయ్యాడు. ఆ తర్వాత శ్రీకాకుళంలో దొంగతనాలకు పాల్పడి జైలు పాలయ్యాడు.

ఘరానా దొంగ అరెస్ట్
ఓ ఘరానా దొంగను విశాఖ త్రీటౌన్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. 11 కేసుల్లో నిందితుడైన ఆ దొంగను శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఘరానా దొంగ అరెస్ట్
అతని వద్ద నుంచి 450 గ్రాముల బంగారం, కేజీన్నర వెండి సామాగ్రి, యాపిల్ ఐపాడ్, ఐఫోన్, మారుతి వేగనార్ కారు, మూడు బైకులు స్వాధీనం చేసుకున్నారు.

ఘరానా దొంగ అరెస్ట్
పోలీస్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నగర క్రైం డిసిపి టి రవికుమార్ మూర్తి ఈ మేరకు వివరాలను వెల్లడించారు.

ఘరానా దొంగ అరెస్ట్
విజయనగరం జిల్లా బలిజిపేట మండలం గాంగాడ గ్రామానికి చెందిన మామిడి తిరుపతిరావు ఇంటర్ వరకు చదువుకున్నాడు.

ఘరానా దొంగ అరెస్ట్
శ్రీకాకుళం జిల్లా రాజాం జీఎంార్ కాలేజీలో చదువుకున్న రోజుల్లో జల్సాలకు అలవాటు పడ్డాడు. అప్పట్నుంచే బైకులు దొంగతనం చేయడం ప్రారంభించాడు.
విడుదలయ్యాక విశాఖ చేరుకుని చినవాల్తేరులో ఒక అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడు. ఈ ఏడాది కాలంలో నగరంలో 11 చోరీలు చేశాడు. గాజువాకలో జరిగిన దొంగతనంలో ఏమి దొరకకపోవడంతో పాస్ పోర్టులు తీసుకుని పరారయ్యాడు. పిఠాపురం కాలనీలో ఓ ఇంట్లో ఏమీ దొరకలేదని గోడ మీద రాసి ఆ ఇంటి బయటవున్న కారు తీసుకుని పోయాడు.
బాధితుల ఫిర్యాదు మేరకు చేపట్టిన పోలీసులు నిందితుడిని శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో క్రైం ఏడిసిపి వరదరాజు, సిఐ కొండ, ఎస్ఐలు దామోదరరావు, ఎం భరత్ కుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications