శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అడ్డంగా దొరికిపోయిన దొంగ.. లైట్ ఆఫ్ చేయబోయి.. గుడిలో గంట మోగించాడు!

|
Google Oneindia TeluguNews

శ్రీకాకుళం: గత కొంత నెలల క్రితం ఓ దొంగ ఆలయంలో దొంగతనం చేసి.. ఆలయం గోడకు చేసిన కన్నంలో ఇరుక్కుని దొరికిన ఘటన మరువక ముందే అలాంటి ఘటనే మరోటి చోటు చేసుకుంది. ఆలయంలో దొంగతనానికి వచ్చిన ఇద్దరు దొంగలు అక్కడి లైట్స్ ఆఫ్ చేయబోయి.. గంట మోగించారు. దీంతో ఓ దొంగను పట్టుకున్ని స్థానికులు దేహశుద్ధి చేశారు.

శివాలయంలో చోరీకి ప్లాన్ వేసిన దొంగలు

శ్రీకాకుళం జిల్లాలోని మామిడివలసలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..ఇక్కడ ఓ పురాతన శివాలయం ఉంది. నిత్యం స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామి వారిని దర్శనం చేసుకుంటారు. హుండీలో కానుకలు కూడా వేస్తుంటారు. ఈ విషయాన్ని గమనించిన ఇద్దరు దొంగలు ఈ ఆలయంలో చోరీ చేసేందుకు ప్లాన్ వేశారు.

లైట్లు ఆఫ్ చేయబోయి.. గంట మోగించిన దొంగలు

లైట్లు ఆఫ్ చేయబోయి.. గంట మోగించిన దొంగలు

రాత్రిపూట ఆలయంలోకి చొరబడ్డారు. లైట్లు వేసి ఉండటంతో వాటిని ఆఫ్ చేసే ప్రయత్నం చేశారు. లైట్లు ఆఫ్ చేస్తే తమను ఎవరూ గుర్తించరని ఆ ప్రయత్నం చేశాడు ఓ దొంగ. అయితే, అతడు లైట్లు ఆఫ్ చేసే స్విచ్ఛ్‌కు బదులు.. విద్యుత్ గంటా మోగే స్విచ్ఛ్‌ను నొక్కాడు. ఇంకేముందు ఒక్కసారిగా గంట మోగడంతో సమీపంలో నిద్రిస్తున్న విద్యార్థులు, స్థానికులు ఉలిక్కపడి లేచారు.

దొంగను చితకబాదిన స్థానికులు.. స్తంభానికి కట్టేసి..

ఈ క్రమంలో అక్కడ్నుంచి పారియేందుకు ప్రయత్నించారు ఇద్దరు దొంగలు. అయితే, ఓ దొంగను పట్టుకున్నారు స్థానికులు. ఆ తర్వాత అతడికి దేహశుద్ధి చేసి.. స్తంభానికి కట్టేశారు. ఆ తర్వాత సమాచారం ఇవ్వడంతో.. పోలీసులు అక్కడికి చేరుకుని దొంగను అదుపులోకి తీసుకున్నారు. అయితే, రెండు నెలల క్రితం కూడా ఈ ఆలయంలో దొంగతనం జరగడం గమనార్హం. అప్పుడు హుండీని ఎత్తుకెళ్లారు దొంగలు. ఈసారి మాత్రం దొంగ దొరకడంతో కటకటాలపాలయ్యాడు.

English summary
A thief caught by locals in Srikakulam district, when he entered temple to theft money and ornaments
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X