ఏపీలో 14 మంది ఐఏఎస్ అధికారుల రిటైర్ - జాబితాలో..!!
ఏపీలో పెద్ద సంఖ్యలో ఐఏఎస్ లు రిటైర్ కానున్నారు. ఎన్నికల తరువాత ఒకే సారి దాదాపు 14 మంది ఐఏఎస్ అధికారులు పదవీ విరమణ చేయనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నురచి డిసెంబర్ వరకు ఏకంగా 14 మంది ఐఏఎస్ అధికారులు రిటైర్ కావాల్సి ఉంది. ఎన్నికల తరువాత కొత్త ప్రభుత్వానికి ప్రస్తుతం కీలక హోదాలో ఉన్న అధికారుల పదవీ విరమణ సమస్యగా మారే అవకాశం కనిపిస్తోంది. వీరిలో ప్రస్తుతం సీఎస్ గా ఉన్న జవహర్ రెడ్డి నుంచి పలువురు ఉన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 18 మంది ప్రత్యేక ప్రధాన కార్యదర్శుల స్థాయి అధికారులు ఉరడగా, వారిలో జవహర్‌రెడ్డి సిఎస్‌గా ఉన్నారు. మరో సీనియర్ అధికారి సుమితా దావ్రా కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. ఈ జాబితాలో నీరబ్‌కుమార్ ప్రసాద్, పూనం మాలకొరడయ్య, రజత్ భార్గవ, కె.ప్రవీణ్‌కుమార్, బి.రాజశేఖర్, గోపాలకృష్ణ ద్వివేది ఈ ఏడాదిలోనే ఉద్యోగ విరమణ చేయనున్నారు. వీరు కాకుండా ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శుల స్థాయి అధి కారులు మరో తొమ్మిది మంది కూడా జాబితాలో ఉన్నారు. వీరిలో ప్రశారతి ఆంధ్రాకు కేటాయిరచబడినా ఇప్పటికీ తెలంగాణలోనే పనిచేస్తున్నారు. మరో అధికారి శివశ్రీనివాస్ గత నెల్లోనే ఉద్యోగ విరమణ చేశారు.

ఇక బి.శ్రీధర్, గిరిజా శంకర్ ముఖ్య కార్యదర్శుల హౌదాలో, హెచ్.అరుణ్ కుమార్, ధనుంజయరెడ్డి కార్య దర్శుల హౌదాలో, పి.కోటేశ్వరరావు, వెరకట రమణారెడ్డి, సుబ్బారావు ఇతర స్థాయిలో పదవీ విరమణ చేయనున్నారు. కొద్ది సమయం తేడాతో దాదాపు 14 మంది సీనియర్ ఐఏఎస్‌లు రిటైర్ అవుతురడడంతో దాని ప్రభావం పాలనపై ప్రభావం చూపే అవకాశం ఉంది. వీరి స్థానంలో ముఖ్య కార్యదర్శులుగా ఉన్న వారికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతి లభిరచినప్పటికీ, కింద స్థాయిలో మళ్లీ కొరత పెరుగుతురదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి కొత్త ఐఏఎస్‌ల కేటాయిరపులను పెరచాలని కోరేరదుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీంతో, తాజాగా ఐఏఎస్ ల కేటాయింపులో ఏపీకి ప్రాధాన్యత ఇవ్వాలంటూ తాజాగా కేంద్రానికి ప్రతిపాదనలు అందాయి.












Click it and Unblock the Notifications