చంద్రబాబు డైరెక్షన్ లో దూసుకెళ్లిన బుల్లెట్.. : ముద్రగడ దీక్ష విరమణ వెనుక అంతా తానై.

రాజమండ్రి : ఓవైపు క్షీణిస్తోన్న ముద్రగడ ఆరోగ్యం.. మరోవైపు కాపు వర్గాల నుంచి ఒత్తిడి.. పైగా ప్రభుత్వం ఇచ్చిన హామి నేపథ్యంలోనే చోటు చేసుకున్న తుని ఘటన. ముద్రగడ దీక్ష ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి పెట్టేదిగా తయారవడంతో సమస్య మరింత జటిలం కాకుండా ఉండడానికి ప్రభుత్వం ఓ అస్త్రాన్ని సంధించింది. ఆ అస్త్రమే విశాఖ డీజీపీ శ్రీకాంత్.

కాపు ఉద్యమ నేత ముద్రగడతో ప్రభుత్వం తరుపున చర్చలు జరిపి, ఆయన్ను దీక్ష విరమించేలా చేయడంలో ముఖ్యపాత్ర పోషించిన అధికారి డీజీపీ శ్రీకాంత్. పోలీస్ శాఖలో ఎన్నో సమస్యలను సమన్వయంతో చక్కదిద్దారన్న పేరున్న ఆయన తాజా సమస్యను కూడా తన నేర్పుతో గట్టెక్కించడాన్న అభిప్రాయాలు వ్యక్తిమవుతున్నాయి.

మొత్తానికి చర్చల ద్వారా ముద్రగడ దీక్ష విరమింపజేయడం ప్రభుత్వానికి పెద్ద భారం తగ్గించిననట్టవడంతో.. దాని వెనుక కీలక పాత్ర పోషించిన శ్రీకాంత్ చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింంది. ముద్రగడతో దీక్ష విరమింపజేయడానికి ఆస్కారమున్న అవకాశాలను సద్వినియోగం చేసుకున్న ఆయన, మంగళ, బుధవారాల్లో రాజమండ్రిలోనే మకాం వేసి అక్కడి కలెక్టర్ హెచ్‌.అరుణ్‌కుమార్‌ ని వెంటపెట్టుకుని ముద్రగడతో, కాపు జేఏసీ నేతలతో, ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణతో చర్చల మీద చర్చలు జరిపి సమస్యను ఓ కొలిక్కి తీసుకొచ్చేలా చేశారు.

A trouble shooter was Behind in breaking mudragadas strike

అయితే ఎన్ని చర్చలు జరిపినా..! అరెస్టయిన వారిని విడుదల చేయాల్సిందిగా ముద్రగడ వర్గం పట్టుబడగా.. సానుకూలంగా స్పందించిన డీజీపీ శ్రీకాంత్, నిర్దోషులు కేసులో ఇరుక్కునే ప్రమాదం ఉందని చెబుతున్నారు కాబట్టి, దీనిపై మరింత లోతుగా పునర్విచారణ చేపట్టేలా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామని హామి ఇచ్చారు.

ఇక అరెస్టు చేసినవారిని విడుదల చేస్తామని అంగీకరిస్తూ.. లిఖితపూర్వక హామి ఇవ్వాలని ముద్గడ పట్టుబడడంతో, అది చట్టబద్దం కాదని సున్నితంగా ముద్రగడకు నచ్చజెప్పిన డీజీపీ భవిష్యత్తులో దానివల్ల సమస్యలు తలెత్తే అవకాశముందని చెప్పడంతో ముద్రగడ కాస్త వెనక్కి తగ్గినట్టుగా సమాచారం.

ఇదిలా ఉంటే అరెస్టు చేసి జైళ్లో పెట్టిన నలుగురు కీలక నేతలను తనతో సమావేశ పర్చాల్సిందిగా ముద్రగడ కోరగా, వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వచ్చిన ఆ నేతలను ముద్రగడతో మాట్లాడించడానికి డీజీపీ చొరవ తీసుకున్నట్టు తెలుస్తోంది. ముద్రగడకు ఇచ్చిన మాట ప్రకారం ఆ నేతలతో మాట్లాడించేలా చేసిన డీజీపీ, వాళ్ల విడుదల మాత్రం ప్రస్తుతానికి సాద్యపడదని ముద్రగడకు ఓపిగ్గా వివరించారట.

మంగళవారం ముద్రగడతో చర్చలు ముగిశాక తిరిగి అదే రాత్రి విజయవాడ వెళ్లిన డీజీపీ శ్రీకాంత్, సీఎం చంద్రబాబును కలిసి జరుగుతున్న పరిణామాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ముఖ్యమంత్రి పలు సూచనలు-సలహాలు చేయడంతో, మళ్లీ రాజమండ్రిలో వాలిపోయిన డీజీపీ బుధవారమంతా ముద్రగడతోనే ఎక్కువసేపు చర్చిస్తూ గడిపారు.

బుధవారం ముద్రగడతో ఆయన జరిపిన సుదీర్ఘ మంతనాలు ముద్రగడకు కాస్త నమ్మకం కలిగించడంతో దీక్ష విరమణకు ఆయన సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. కాగా, ప్రభుత్వం తరుపున డీజీపీ ఇచ్చిన హామిల మేరకు అరెస్టయిన వారికి బెయిల్‌ చేసేందుకు ప్రభుత్వం కూడా తమవంతు సహకారం అందిస్తుందని తెలిపినట్టు సమాచారం.

అయితే ప్రస్తుతానికి తుని ఘటనలో 13 మందిపై నమోదైన కేసులు అలాగే కొనసాగుతాయని..
సమగ్ర పనర్విచారణ జరిపాక అల్లర్లతో వాళ్లకేమి సంబంధం లేదని తేలితేనే కేసులు ఎత్తివేయడం సాధ్యమవుతుందని డీజీపీ ముద్రగడతో వివరించినట్టు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+