కేబినెట్ భేటీ: తల్లికి వందనం నిధుల జమ, రుణమాఫీ పై కీలక నిర్ణయాలు..!!
ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. పాలనా పరంగా.. రాజకీయంగానూ కీలక నిర్ణయాల పై చర్చించనుంది. అమరావతి నిర్మాణాలు.. భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం నుంచి అందించే ప్రోత్సాహకాల పై పలు నిర్ణయాలకు ఆమోద ముద్ర వేయనున్నారు. రాష్ట్రం లో కొత్త పెట్టుబడుల కే గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అధికారిక అజెండా తరువాత ప్రస్తుత రాజకీయ పరిణామాలు.. వైసీపీ చేస్తున్న విమర్శల పైన మంత్రులకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేయనున్నట్లు సమాచారం.
ఏపీ మంత్రివర్గం ఈ రోజు సమావేశం కానుంది. కీలక అంశాల పైన చర్చించి.. నిర్ణయాలు తీసుకోనున్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు మరింత లబ్ధి చేకూర్చేలా ఈ సమావేశంలో పలు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోనున్నారు. ల్యాండ్ పూలింగ్ (భూ సమీకరణ) కింద కొత్తగా భూములు ఇచ్చే రైతులకు మెరుగైన ప్యాకేజీ ఇచ్చేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా మెట్ట భూములకు ఎకరాకు రూ. 40 వేలు, జరీబు భూములకు రూ. 60 వేల చొప్పున వార్షిక కౌలు చెల్లించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. దీనితో పాటు, ట్రంక్ రోడ్ల విస్తరణలో భాగంగా ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు నెలకు రూ. 10 వేల చొప్పున అద్దె సాయం అందించే ప్రతిపాదనకు కూడా గ్రీన్ సిగ్నల్ లభించనుంది.

కీలక అంశాల పై చర్చ.. నిర్ణయాలు
అదే విధంగా రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి, పర్యాటకం, ఆధ్యాత్మిక రంగాల విస్తరణ దిశగా కేబినెట్ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మత్స్యశాఖ ఆధ్వర్యంలో అత్యాధునిక అక్వేరియం ప్రాజెక్ట్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు 7.42 ఎకరాల స్థలం, పార్కుల పర్యవేక్షణ బాధ్యతలను ఈశా ఫౌండేషన్‌కు అప్పగించడం, సీఐఐ (CII) కి 4 ఎకరాల భూకేటాయింపులపై ఈ భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. వీటన్నింటితో పాటు, రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) ఆమోదించిన 11 మెగా ప్రాజెక్టులకు కేబినెట్ క్లియరెన్స్ ఇవ్వనుంది. తద్వారా రాష్ట్రంలోకి రూ. 9,076 కోట్ల పెట్టుబడులు రావడమే కాకుండా, 10,531 మంది యువతకు కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఇక.. రాజకీయంగానూ మంత్రివర్గ సహచరులతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. ప్రభుత్వం పైన వస్తున్న విమర్శలు.. ప్రతిపక్షాల తీరు పైన స్పందించటం పైన మంత్రులకు సీఎం దిశా నిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది.













Click it and Unblock the Notifications