వేధింపులు తట్టుకోలేక.. భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య

కరీంనగర్: జిల్లాలోని పెద్దపల్లిలోని సుభాష్‌నగర్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. భర్తను గొడ్డలితో భార్య నరికి చంపింది. భర్త పెట్టే వేధింపులు భరించలేకనే ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

జిల్లాలో జరిగిన మరో ఘటనలో జమ్మికుంట మండలంలోని వెంకటేశ్వర్లపల్లెలో సేద్యం బావి తవ్వుతుండగా బావి అంచు కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. పాపయ్యపల్లె గ్రామానికి చెందిన నర్సింగం, కుమార అనే కార్మికులు బావిని తవ్వుతుండగా అంచు కూలి మట్టిలో కూరుకుపోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. ఇద్దరి మృతితో పాపయ్యపల్లెలో విషాదం చోటు చేసుకుంది.

డిసిఎంను ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి

A woman allegedly murdered her husband in karimnagar

మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్‌లోని అప్పన్నపల్లి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎంను ఓ కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

వ్యాపారి ఇంట్లో చోరీ

హైదరాబాద్ నగరంలోని లంగర్‌హౌజ్‌ ప్రాంతంలో ఉన్న సాలార్‌జంగ్‌కాలనీలో భారీ చోరీ జరిగింది. సుమిత్ అగర్వాల్ అనే వ్యాపారి ఇంట్లో రూ. కోటి విలువ చేసే సొత్తు చోరీకి గురైనట్లు తెలిసింది.

లోయలో పడిన విద్యార్థి

చిత్తూరు జిల్లాలోని బి కొత్తకోట మండలంలో ఉన్న పర్యాటక ప్రాంతం హార్స్‌లీ హిల్స్‌లో ఓ విద్యార్థి ప్రమాదవశాత్తూ కాలుజారి లోయలో పడిపోయాడు. అతడిని కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. స్నేహితులతో కలిసి విహార యాత్రకు వచ్చిన ఆ విద్యార్థి లోయలో పడ్డాడని స్థానికులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+