సహజీవనం చేసి వదిలేశాడు: వర్థమాన సినీ హీరోపై ఫిర్యాదు
విశాఖపట్నం: పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన వర్థమాన సినీ హీరోపై చర్యలు తీసుకుని, తనకు న్యాయం చేయాలని డ్యాన్సర్ పద్మావతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సోమవారం విజెఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తొమ్మిదేళ్ల క్రితం పెద్దల సమక్షంలో తనకు వివాహం జరిగిందని, ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత భర్త తనను వదిలేశాడని చెప్పింది.
మూడేళ్లపాటు దుబాయ్‌లో డ్యాన్స్ చేస్తూ బతికినట్లు తెలిపింది. ఏడాది కిందట విశాఖపట్నం వచ్చిన తనకు జగదాంబ జంక్షన్ లేపాక్షి వెనుక వీధిలో ఉంటున్న వర్థమాన సినీ హీరో రాజుతో పరిచయం ఏర్పడిందని చెప్పింది.

ఆ పరిచయం పెరిగి ప్రేమగా మారిందని, దీంతో తామిద్దరం సహజీవనం చేస్తున్నామని తెలిపింది. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉండటంతో ఇటీవల తల్లి ఇంటికి చేరానని, కన్నవారింటికి వచ్చిన వారానికి వివాహం చేసుకోమని అడిగితే రాజు నిరాకరించాడని తెలిపింది.
‘నాకు రూ. 10లక్షల అప్పు ఉంది, నా మరదలు బాగా ఆస్తి పరురాలు, ఆమెను త్వరలో వివాహం చేసుకుంటా' అని రాజు తనతో చెప్పినట్లు తెలిపింది. తనకు జరిగిన ఈ అన్యాయంపై ఇటీవల కంచరపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. మోసం చేసిన రాజుపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది.












Click it and Unblock the Notifications