Hyderabad: పోలింగ్ కేంద్రంలోనే కుప్పకూలిపోయిన మహిళ..
ఓటు వేయడానికి వచ్చిన ఓ మహిళ పోలింగ్ కేంద్రంలోనే కుప్పకూలిపోయారు. హైదరాబాద్ ఉప్పల్ లో ఈ ఘటన జరిగింది. భరత్ నగర్ కు చెందిన విజయలక్ష్మి అనే మహిళ ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. పోలింగ్ కేంద్రంలోకి వచ్చిన ఆమెకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో విజయలక్ష్మి అక్కడే పడిపోయాడు. పోలింగ్ సిబ్బంది ఆమెన్ వెంటనే ఆస్పత్రికి తరలించారు. విజయలక్ష్మి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
దీంతో మృతురాలి కుటుంబంలో విషాదం నెలకొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ సాయంత్ర 4 గంటలకే ముగిసింది. మిగతా చోట్ల సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియనుంది. తెలంగాణలో మధ్యాహ్నం 3 గంటల వరకు 52.34 శాతం పోలింగ్ నమోదయింది. ఖమ్మంలో 63,67 శాతం, కరీంనగర్ లో 58.24 శాతం, మహబూబాబాద్ లో 61.4 శాతం, పెద్దపల్లిలో 55.92 శాతం, నల్గొండలో 59.91 శాతం పోలింగ్ నమోదు అయింది.













Click it and Unblock the Notifications