దారుణం: ప్రియుడి కోసం భర్తను కొట్టి చంపించింది

A woman and four persons are arrested for killing her husbad
హైదరాబాద్: నగరంలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ, తన ప్రియుడి కోసం కట్టుకున్న భర్తనే కడతేర్చింది. ఈ ఘటన జరిగిన మే 26న అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు, తమ విచారణలో హత్యగా తేల్చారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను శుక్రవారం అరెస్ట్ చేశారు.

శంషాబాద్ ఏసిపి సుదర్శన్, ఆర్‌జిఐఏ సిఐ సుధాకర్ చెప్పిన కథనం ప్రకారం.. మే 26న అర్ధరాత్రి శంషాబాద్‌లోని ఆర్‌బి‌నగర్‌కు చెందిన దర్జీ తోట శ్రీశైలం అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యాడు. అతని భార్య సరితకు కందుకూరు మండలం సరస్వతీగూడకు చెందిన సందీప్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో శ్రీశైలంను అడ్డు తొలగించాలనుకున్నారు.

మే 26న అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో సందీప్ తన మిత్రులు యదగిరి, జంగయ్య, బాల్‌రాజ్‌లను తీసుకుని ఓ వాహనంలో శంషాబాద్ వచ్చాడు. శ్రీశైలం ఇంటికి వెళ్లిన సందీప్ నిద్రతిస్తున్న శ్రీశైలంను వాహనంలో తీసుకుని బురుజుగడ్డ వద్దకు వచ్చారు. శ్రీశైలంను సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డు పక్కన పడేసి ఇనుప రాడ్‌తో కొట్టి చంపారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశారు.

ఆ తర్వాత సందీప్, మిగితా ముగ్గురు కలిసి కారులో యాదగిరిగుట్టకు వెళ్లారు. తనకు సహకరించినందుకు సందీప్.. జంగయ్యకు రూ. 50వేలు, బాల్‌రాజ్‌కు ప్లాట్‌ను ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. కేసును ఛేదించిన పోలీసులు హత్యకు సహకరించిన సరిత తోపాటు మిగితా నిందితులను అరెస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+