3ఏళ్ల ప్రేమ-రహస్యంగా పెళ్లి: గర్భం దాల్చిన యువతి, కులం కాదంటూ వదిలేశాడు
కడప: ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు.. చివరకు ఆమె మనసు గెలిచి రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం కాపురం చేసిన అతడు.. ఆమె గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించాడు. ఆ తర్వాత ఆమెకు కనిపించకుండా తిరుగుతూ ముఖం చాటేశాడా దుర్మార్గుడు.
దీంతో బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ.. భర్త ఇంటి ఎదుట నిరసనకు దిగింది. ఆమెకు మద్దతుగా కుటుంబసభ్యులు, పలువురు మహిళలు ధర్నాలో ఆమెతోపాటు కూర్చుకున్నారు. ఈ ఘటన కడప జిల్లాలోని రాజంపేటలో చోటు చేసుకుంది.

ప్రేమ.. రహస్యంగా పెళ్లి..
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. రాజంపేటలోని ఐసీఐసీఐ బ్యాంక్ ఉద్యోగిగా పనిచేస్తున్న రంగాయపల్లె రెడ్డయ్య(రాకేష్) అనే యువకుడు.. శివపురం రంగయ్య కుమార్తె విజయలక్ష్మీ గత మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. కొద్ది నెలల క్రితం పెద్దలకు తెలియకుండా వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.

మాయమాటలు చెప్పి..
ఈ క్రమంలో విజయలక్ష్మి గర్భం దాల్చింది. ఇప్పుడే పిల్లలు వద్దని, పెద్దలను ఒప్పించిన తర్వాతే ఆలోచిద్దామని మాయమాటలు చెప్పి ఆమెకు అబార్షన్ చేయించాడు భర్త రెడ్డయ్య. ఆ తర్వాత విజయలక్ష్మిని ఆమె తల్లిదండ్రుల వద్ద వదిలి వెళ్లిపోయాడు.

ముఖం చాటేశాడు..
ఇక విజయలక్ష్మిని చూడటం కూడా మానేశాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన విజయలక్ష్మి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గతంలో రాజంపేట సీఐ ఇరు కుటుంబాల వారిని పిలిపించి మాట్లాడారు. తాను అందరి సమ్మతితో పెళ్లి చేసుకుంటానని, లేని పక్షంలో తనపై పోలీసులు ఎలాంటి చర్య అయినా తీసుకోవచ్చని రెడ్డయ్య లిఖిత పూర్వకంగా పోలీసులకు రాసిచ్చాడు.

మాట మార్చాడు
ఇప్పుడెమో తాను విజయలక్ష్మిని వివాహం చేసుకోనని, ఆమె తమ కులం కాదని రెడ్డయ్య చెబుతున్నాడు. ఈ క్రమంలో విజయలక్ష్మి ఆమె భర్త రెడ్డయ్య ఇంటి ముందు నిరసనకు దిగింది. తనకు న్యాయం చేయాలంటూ విజయలక్ష్మి కోరుతోంది.
తనకు న్యాయం జరిగే వరకు ఈ దీక్ష కొనసాగుతుందని ఆమె చెప్పారు. అయితే ఈ సంఘటనలో రెడ్డయ్యను పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. విజయలక్ష్మీ ఇంటి ఎదట దీక్ష చేపట్టడం పట్ల పలువురు మహిళలు ఆమెకు మద్దతు పలికారు.












Click it and Unblock the Notifications