కాకినాడలో అందరూ చూస్తుండగా మహిళపై అత్యాచారం.. వీడియో వైరల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగా గుర్తు తెలియని ఒక మహిళపై ఒక యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన అందరినీ షాక్ కి గురి చేసింది. గత శుక్రవారం ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ దారుణ ఘటన జనమంతా చూస్తుండగా కాకినాడ లోని కోటనందూరు లో మెయిన్ రోడ్డు పై ఉన్న మార్కెట్ షెడ్లో జరిగింది.
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకు ఏం జరిగిందంటే ఓ మతిస్థిమితం లేని గిరిజన మహిళను కొందరు యువకులు కోటనందూరు మెయిన్ రోడ్డు పై ఉన్న మార్కెట్ షెడ్ కు తీసుకు వచ్చారు . వారిలోని ఒక యువకుడు ఆ మహిళను మార్కెట్ షెడ్లో దారుణంగా అత్యాచారం చేశాడు.

మార్కెట్లో బైక్ లు పార్క్ చేసి ఉండగా, ఆ బైక్ ల పక్కకు తీసుకువెళ్లి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మరో వ్యక్తి దీనిని అంతా వీడియో తీశాడు. అయితే ఆ తర్వాత వారు ఆ మహిళను ఎక్కడికి తీసుకువెళ్లారు అనే విషయం అక్కడ ఉన్న వారికి ఎవరికీ తెలీదు. మతిస్థిమితం లేని మహిళను తీసుకువచ్చిన యువకులు మద్యం, గంజాయి మత్తులో ఉన్నట్టుగా స్థానికులు చెబుతున్నారు.
ఇంత దారుణమైన జరుగుతున్నా ఎవరూ ఆ దారుణాన్ని ఆపలేకపోయారు.ఇక సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో ఈ ఘటన పై దృష్టిసారించిన పోలీసులు కోటనందూరులో విచారణ చేపట్టారు. అక్కడ స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, దారుణానికి పాల్పడిన యువకులు ఎవరు అన్నది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
మతిస్థిమితం లేని గుర్తుతెలియని గిరిజన మహిళ ఎవరు? ఆమెను వారు ఎక్కడి నుంచి తీసుకువచ్చారు? ఆమెపై అత్యాచారం చేసిన తరువాత ఆమెని ఎక్కడి కి తీసుకు వెళ్లారు? వంటి వివరాలను సేకరించే పనిలో పడ్డారు. కానీ దారుణమైన ఈ ఘటనతో కోటనందూరు ప్రాంతవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.












Click it and Unblock the Notifications