Crime News: శివుడు పిలుస్తున్నాడు.. వెళ్తున్న అంటూ యువకుడి ఆత్మహత్య..
టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతున్నా.. కొందరికి పిచ్చి నమ్మకాలు మాత్రం పోవడం లేదు. ఓ యువకుడు శివుడు తనను పిలుస్తున్నాడని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం మండలం చాట్లమడ గ్రామంలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

బీటెక్ 4వ సంవత్సరం
చాట్లమడ గ్రామానికి చెందిన వెంకట పూర్ణ శేఖర్ రెడ్డికి శివుడు అంటే ఇష్టం. అతని తండ్రి చనిపోగా.. తల్లికి, చెల్లికి అన్నీ తానై పోషిస్తున్నాడు. ప్రస్తుతం అతను చెన్నైలో బీటెక్ 4వ సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో ఏమైందో తెలియదు గానీ, శనివారం చెన్నై నుంచి తన స్వగ్రామానికి వచ్చాడు. శివయ్య పిలుస్తున్నాడంటూ ఓ సూసైడ్ నోట్ రాసి ఆదివారం సాయంత్రం ఇంట్లో ఫ్యానుకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ప్రేమ లేదు
తన చావుకు ఎవరూ కారణం కాదని, ప్రేమ వంటి వ్యవహారాలు లేవని లేఖలో రాశాడు. తాను పిరికివాడిని కాదని, ఈ పాడు సమాజంలో ఉండవద్దంటూ శివుడు చెప్పాడని, అందుకే చనిపోతున్నానని లేఖలో పేర్కొన్నాడు. తన తండ్రి కూడా శివయ్య దగ్గరే సేవ చేస్తున్నందున అక్కడికే వెళ్ళిపోతున్నానని సూసైడ్ నోట్ లో రాశాడు. వచ్చే జన్మలో సమాజానికి మేలు చేసేందుకు అవకాశం కల్పించాలని శివయ్యను వేడుకుంటానని, చనిపోతూ తన చెల్లెలు సాయిలక్ష్మిని బంధువులంతా బాగా చూసుకోవాలని కోరాడు.

ఆస్తులన్నీ తన చెల్లెలి పేరుతో
ఆస్తులన్నీ తన చెల్లెలి పేరుతో రాయాలని, మంచి వరుణ్ణి చూసి పెళ్లి చేయాలన్నాడు. ఇన్ని జాగ్రత్తలు చెబుతున్న తనకు ఒకరితో చెప్పించుకోవాల్సిన అవసరం లేదని, కేవలం శివయ్య పిలుస్తున్నందునే సూసైడ్ చేసుకుంటున్నట్టు పేర్కొన్నాడు. అయితే కొడుకు మృతి తల్లి కన్నీరుమున్నిరయింది.












Click it and Unblock the Notifications