నవ వధూవరుల ముందే కుప్పకూలిపోయాడు, క్షణాల్లోనే.. (వీడియో)

ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండానే పలువురు వ్యక్తులు ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. ఆస్పత్రికి తీసుకెళ్లేలోగానే ప్రాణాలు వదులుతున్నారు. తాజాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. స్నేహితుడి పెళ్లి వేడుకలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న యువకుడు.. పెళ్లి మండపంలోని వధూవరులను కలిసేందుకు వచ్చి కుప్పకూలిపోయాడు. క్షణాల్లోనే తుదిశ్వాస విడిచాడు.

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కృష్ణగిరి మండలం పెనుమాడ గ్రామంలో ఓ పెళ్లి వేడుక జరుగుతోంది. నవ దంపతులకు పలువురు కానుకలు ఇచ్చి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే వంశీ అనే యువకుడు తన స్నేహితులతో స్టేజీపైకి వచ్చాడు. నవ వధూవరులకు వారంతా ఓ కానుక ఇచ్చారు. వారిచ్చిన బహుమతిని వరుడు తెరిచి చూస్తుండగా.. స్నేహితులంతా ఆనందంగా నవ్వుతూ చూడసాగారు.

A young man died of a heart attack in front of the newlyweds on the wedding stage

అయితే, వంశీ ఒక్కసారిగా స్నేహితుల సాయం కోరుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్నేహితులంతా అతడ్ని పట్టుకుని కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు. కానీ, అతడు క్షణాల్లో ప్రాణాలు వదిలాడు. అమెజాన్‌లో ఉద్యోగం చేస్తున్న వంశీ తన స్నేహితుడి వివాహానికి వచ్చి ఇలా విగతజీవిగా మారడంతో అక్కడంతా విషాదం నెలకొంది.

వంశీ కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలిన ఘటనకు సంబంధించి పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోలో వరుడు బహుమతిని విప్పుతుండగా.. వంశీ తన ఎడమ వైపునకు వంగి బ్యాలెన్స్ కోల్పోవడం కనిపిస్తుంది. వెంటనే అతడ్ని ధోన్ సిటీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే వంశీ చనిపోయినట్లు వైద్యులు నిర్ధరించారు. వంశీ కార్డియాక్ అరెస్ట్‌తో మరణించినట్లు తెలిసింది. కాగా, వయస్సు పైబడిన వారికి మాత్రమే గతంలో గుండెపోటు రాగా.. ఇప్పుడు 30 శాతం వరకు గుండెపోటు కేసులు 40 ఏళ్ల లోపువారికే వస్తున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తుండటం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+