చట్టవిరుద్ధంగా ఆ జనసేన మంత్రి..! చంద్రబాబుకు ఆప్ నేత, మాజీ బ్యూరోక్రాట్ ఫిర్యాదు..!
ఏపీలో జనసేన మంత్రి, ఆ పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ పై మాజీ బ్యూరోక్రాట్, ప్రస్తుత ఆప్ నేత పీవీఎస్ శర్మ సీఎం చంద్రబాబుకు ఓ ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ లో ఈ మేరకు ఆయన ఓ వీడియో పోస్టు చేశారు. తన పోస్టుకు నాదెండ్లతో పాటు సీఎం చంద్రబాబును ట్యాగ్ చేశారు. ఇందులో జనసేన మంత్రి తీరుపై ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఆయన తీరును గమనించాలని సీఎం చంద్రబాబును కోరారు. ఇంతకీ విషయం ఏంటంటే..
ఏపీలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్ తన శాఖ పరిధిలోకి వచ్చే రేషన్ షాపుల్ని, రేషన్ బియ్యం సరఫరా టార్గెట్ గా వరుస తనిఖీలు చేస్తున్నారు. కాకినాడతో పాటు తన నియోజకవర్గం తెనాలి, ఇతర ప్రాంతాల్లో వరుస తనిఖీలు చేస్తూ అక్రమార్కులను బెంబేలెత్తిస్తున్నారు. ఇదంతా కరెక్టే అయినా ఇలా నేరుగా రేషన్ షాపులకు వెళ్లి మరీ రేషన్ డీలర్లను భయపెట్టడం ఏంటనే చర్చ తెరపైకి వస్తోంది. ఇదే అంశాన్ని ఆప్ నేత, మాజీ బ్యూరోక్రాట్ పీవీఎస్ శర్మ కూడా ప్రస్తావించారు.

This minister goes around small shops to throw his weight around.
— PVS Sarma (@pvssarma) July 14, 2024
Technically, he is NOT authorised to enter any premises without a warrant. It’s illegal.
Hope the AP CM @ncbn takes note of this unconstitutional behaviour.@PawanKalyan @mnadendla pic.twitter.com/9rNHDsjQaG
పీవీఎస్ శర్మ ఎక్స్ లో చేసిన పోస్టులో ఈ మంత్రి తన అధికారాన్ని వాడి చిన్న షాపుల చుట్టూ తిరుగుతున్నారని ఆక్షేపించారు.అలాగే సాంకేతికంగా, వారెంట్ లేకుండా ఏ ప్రాంగణంలోకి ప్రవేశించడానికి అతనికి అధికారం లేదన్నారు. ఇది చట్టవిరుద్ధమన్నారు. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించి.. ఈ రాజ్యాంగ విరుద్ధమైన ప్రవర్తనను గమనించాలని పీవీఎస్ శర్మ కోరారు. అలాగే జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కూడా ఈ పోస్టుకు ట్యాగ్ చేశారు. దీనిపై చంద్రబాబు, పవన్ స్పందిస్తారో లేదో చూడాల్సి ఉంది.
-
YS Sharmila: జగన్ పై ముందుచూపు సరే..! చంద్రబాబుపై షర్మిల సెటైర్లు..! -
జగన్ కు జనాలిచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా సరిపోలేదేమో..మంత్రి లోకేష్ సెటైర్లు -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..?












Click it and Unblock the Notifications