మా అమ్మకు 50 ఏళ్ళ అందమైన వరుడు కావాలని ఓ తనయ ట్వీట్... షరతులు కూడా వర్తిస్తాయట !!

వాస్తవానికి భిన్నంగా సాధారణంగా సినిమాలు, సీరియళ్లలో అమ్మకు పెళ్లి చేయాలని కూతుళ్లు తపన పడటం చూస్తుంటాం. అవి రీల్ లైఫ్ స్టోరీస్ కాబట్టి అంతగా ప్రయారిటీ ఇవ్వం కానీ రియల్ లైఫ్ లోనూ మా అమ్మకు వరుడు కావాలి అని ఒక కూతురు అనే తెగ వెతుకుతుంది అంటే కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది . ఒంటరిగా ఉన్న తల్లికి పెళ్లి చేయాలనే కూతురు ఆలోచనను సమర్ధించి కొందరు ఆల్ ది బెస్ట్ చెప్తే,మరికొందరు ఇదెక్కడి విడ్డూరం అంటూ పెదవి విరుస్తున్నారు.

ఇక అసలు విషయానికొస్తే తాజాగా ఆస్తా వర్మ అనే అమ్మాయి మా అమ్మకు వరుడు కావాలి అంటూ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక ఆ ట్వీట్ లో అమ్మ తో పాటుగా ఆస్తా వర్మ తాను ఉన్న ఫోటోను షేర్ చేసి మరీ వరుడు కావాలని ట్వీట్ చేసింది. ఇక ఈ ట్వీట్ చూసిన చాలామంది రీ ట్వీట్ చేస్తూ ఆస్తా వర్మ తన అమ్మ విషయంలో తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాన్ని అభినందిస్తున్నారు.

Aastha varma Looking for a Handsome 50-Year-Old Man for Her Mother as bridegroom ..conditions apply

లా స్టూడెంట్ అయిన ఆస్తా వర్మ ట్విట్టర్లో తన అమ్మకు వరుడు కావాలని చేసిన ట్వీట్ లో సోషల్ మీడియాలో మహిళలకు లేదా పురుషులకు ఉత్తమ భాగస్వాములు లేదా మంచి ఫ్రెండ్స్ దొరుకుతారు అని కథలుకథలుగా విన్నాను అందుకే ఈ పోస్ట్ చేస్తున్నా అంటూ పేర్కొంది. మా అమ్మకు 50ఏళ్ల వయసున్న అందమైన పెళ్లి కొడుకు కావాలని ట్వీట్ చేసింది.

ఇక అంతే కాదు కొన్ని షరతులు కూడా పెట్టింది. అమ్మ కు కాబోయే వరుడు శాకాహారి గా ఉండాలని,మద్యం సేవించరాదని, బాగా సెటిల్ అయిన వ్యక్తి అయ్యి, మంచివాడై ఉండాలని ఆస్తా వర్మ షరతులు విధించింది. ఇక సోషల్ మీడియాలో స్పందన అయితే బాగుంది కానీ, అమ్మ కోసం ఆస్తా వర్మ చేసిన ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందో మరి. యాభై ఏళ్ళ అందమైన మంచివాడైన, ఆస్తా వర్మ షరతులకు తగిన పెళ్ళికొడుకు దొరుకుతాడా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+