లోకేష్ కాన్వాయ్‌లో అపశృతి: పల్టీలు కొట్టిన కారు, ఎమ్మెల్సీకి తీవ్రగాయాలు
రాజమహేంద్రవరం: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కాన్వాయ్‌లో అపశృతి చోటు చేసుకుంది. రాజమహేంద్రవరం శివారులోని బొమ్మూరు సమీపంలో కాన్వాయ్ లోని కారు బోల్తాపడి. దీంతో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు తీవ్ర గాయాలయ్యాయి.
వేమగిరి వద్ద డివైడర్‌ను ఢీకొనడంతో, కారు మూడు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో అప్పారావుతో పాటు కారు డ్రైవర్, గన్‌మెన్‌లకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వీరిని హుటాహుటిన స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు.













Click it and Unblock the Notifications