ఈ రైలు తొడగొడితే.. మిగతా రైళ్లన్నీ ఆగాల్సిందే!
ప్రజల కోసం వివిధ రీతుల్లో రైళ్లను నడిపిస్తున్న భారతీయ రైల్వే కాలానుగుణంగా చోటుచేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా తనను తాను మార్చుకుంటూ వస్తోంది. పలు సందర్భాల్లో ఒకరైలు కోసం మరొక రైలును క్రాసింగ్ కోసం ఆపేస్తుంటారు. రైళ్లను ట్రాక్ పై నడిపించడానికి రైల్వే కేటగిరి చూస్తుంది. ఆ ప్రకారం ప్రాధాన్యత ఇస్తుంది. అలాగే భారతీయ రైల్వేలో ఒక ప్రత్యేక రైలు ఉంది. దాని ప్రత్యేకతలేమిటో తెలుసుకుందాం.
మనదేశంలో టాప్ ప్రయారిటీ కింద వందేభారత్, రాజధాని, శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైళ్లున్నాయి. దేశవ్యాప్తంగా రాజధాని రైళ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని రైళ్లు ట్రాక్ పైకి వచ్చినప్పుడు రాజధానిని కూడా ఆపేస్తారు. వీటిని ముందు పంపిస్తారు. యాక్సిడెంట్ రిలీఫ్ మెడికల్ ఎక్విప్‌మెంట్ ట్రైన్ (ARME) ప్రమాదాలు జరిగినప్పుడు సంబంధిత స్థలంలో వైద్యసహాయం అందించేందుకు దీన్ని నడుపుతారు. ఈ రైలు పట్టాలెక్కితే మిగతా అన్ని రైళ్ల కంటే దీనికే అధిక ప్రాధాన్యత.

ఏఆర్ఎంఈ రైలు వస్తుంటే రాజధాని, శతాబ్ది కూడా ఆపేసి దీనికి దారిస్తారు. భారతీయ రైల్వేలో అత్యంత ప్రాధాన్యత కలిగిన రైలుగా ఇది ప్రసిద్ధి గాంచింది. అలాగే రాష్ట్రపతి రైలుకు కూడా అత్యధిక ప్రాధాన్యమిస్తారు. రాష్ట్రపతి ఎక్కువగా విమానాల్లో ప్రయాణిస్తున్నారుకానీ గతంలో రైళ్లల్లోనే ప్రయాణించేవారు. టాప్ ప్రయారిటీలో రాజధాని, శతాబ్ది మొదటి రెండు వరుసల్లో నిలుస్తాయి. రాజధాని కచ్చితమైన సమయానికి తన గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. దీనితర్వాత శతాబ్దికి ప్రయారిటీ ఇస్తారు. ఈ రైలు ఒకేరోజులో తన ప్రయాణాన్ని పూర్తిచేసుకుంటుంది. దీనితర్వాత దురంతో, గరీబ్ రథ్, దురంతో ఎక్స్ ప్రెస్, గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్ రైళ్లు వరుస స్థానాల్లో నిలుస్తాయి. ప్రాధాన్యతా క్రమంలో గరీబ్ రథ్ 7వ స్థానంలో నిలుస్తుంది.












Click it and Unblock the Notifications