వైయస్ జగన్ కాన్వాయ్‌కి ప్రమాదం: ఇద్దరికి గాయాలు

గుంటూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ సోమవారం ఉదయం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కాన్వాయ్‌లోని ఇద్దరు ఏఆర్ కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలం కంచనపల్లిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

 Accident to YS Jagan's convoy

ఓ ప్రైవేటు వాహనం వైయస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్‌లోని పోలీస్ వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో ఒంగోలుకు వెళుతుండగా ప్రమాదం సంభవించింది.

అంతకుముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్మీ డియాతో మాట్లాడుతూ.. వైయస్ జగన్ హైదరాబాద్ నుంచి ఉదయం 8.30గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడ పార్టీ కార్యకర్తలు, నేతలతో మాట్లాడతారని చెప్పారు.

ఆ తర్వాత గుంటూరు వెళ్తారని చెప్పారు. పార్టీ నేత అంబటి రాంబాబు నివాసంలో వైయస్ జగన్ అల్పాహారం స్వీకరిస్తారని, అనంతరం నాయకులతో పలు అంశాలపై చర్చిస్తారని చెప్పారు. ఆ తర్వాత ఒంగోలు వెళ్లి రెండో రోజులపాటు జరిగే పార్టీ కార్యక్రమాల్లో జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారని రఘురామ్ వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+