సినిమాల్లో హీరో, జీవితంలో జీరో: చిరుపై సాయికృష్ణ

పార్టీ జెండా పీకేయటమంటే కన్నతల్లి పీక నొక్కేయటమేనని చెప్పిన చిరంజీవి, పది రోజులు గడవక ముందే పార్టీ జెండాను సోనియా కాళ్ళక్రింద పరిచాడని దుయ్యబట్టారు. మంగళవారం ఎన్టీర్ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
రాజకీయాల్లో మార్పు తీసుకు వస్తానని, చరిత్ర సృష్టిస్తానని, సామాజిక న్యాయం సాధిస్తానని ప్రగల్భాలు పలికిన చిరంజీవి ఉత్తర కుమారుడిలా మిగిలి పోయాడని ఆయన ఎద్దేవా చేశారు. చిరంజీవి మొన్న టిక్కెట్లు అమ్ముకున్నాడు, నిన్న ఓటర్లును అమ్మేడు, హోల్‌సేల్‌గా పార్టీనే అమ్మేశాడని, ఇప్పుడు ఏకంగా ఐదున్నర కోట్ల సీమాంధ్రలనే సోనియాకు అమ్ముకున్నాడని విమర్శించారు.
చిరంజీవి వ్యాపారిగా పనికోస్తాడుకాని రాజకీయ లక్షణాలు ఏమాత్రంలేని చిరంజీవి రాజకీయాలకు పనికిరాడని సాయికృష్ణ తెలిపారు.












Click it and Unblock the Notifications