రైతుల ఖాతాల్లో రూ 20 వేలు జమ - ప్రభుత్వం కీలక ప్రకటన..!!
ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తవుతున్న వేళ హామీల అమలు దిశగా అడుగులు వేస్తోంది. దీపావళి నుంచి ఉచిత వంట గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభించింది. ఇక, తాజా బడ్జెట్ లో ఇతర పథకాలకు నిధులు కేటాయింపు చేసింది. ఈ సమయంలో రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద రూ 20 వేలు చొప్పున ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ పథకం అమలు పైన ప్రభుత్వం తాజాగా స్పష్టత ఇచ్చింది.
తాము అధికారంలోకి వస్తే రైతులకు రూ 20 వేలు చొప్పున సాయం అందిస్తామని ఎన్నికల వేళ కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వం వైఎస్సార్ రైతు భరోసా పేరుతో అమలు చేసిన పథకాన్ని అన్నదాత సుఖీభవగా మార్పు చేసింది. ఇప్పుడు, ఈ పధకం అమలు కోసం రైతులు వేచి చూస్తున్నారు. కాగా, ఈ పథకం అమలు పైన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేసారు. అన్నదాతలకు కేంద్రం ఏటా ఇచ్చే రూ.6 వేలతో కలిపి అన్నదాత సుఖీభవ పథం కింద మొత్తం రూ.20వేలు అందజేస్తామన్నారు. త్వరలోనే ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేసేలా కసరత్తు కొనసాగుతుందని వెల్లడించారు.

ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన బడ్జెట్ లో మిగిలిన ఈ ఆర్దిక సంవత్సరానికి రూ 4,500 కోట్లు కేటాయింపులు చేసింది. అయితే, కావాల్సిన స్థాయిలో నిధులు కేటాయించలేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వచ్చే నెలలో సంక్రాంతికి రైతుల ఖాతాల్లో నిధుల జమ పైన ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం సాగింది. కానీ, ఆర్దికంగా వెసులుబాటు ఎంత వరకు సాధ్యమనే చర్చ మొదలైంది. కానీ, ప్రభుత్వం కు ఇప్పుడు రైతులతో పాటుగా విద్యార్ధుల ఫీ రీయంబర్స్ మెంట్ ఒత్తిడి పెరుగుతోంది. దీంతో, పాటు ఆర్దికంగా కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ సమయంలో అన్నదాత సుఖీభవ అమలు పైన ఆచితూచి వ్యవహరిస్తోంది. సంక్రాంతికి అమలు చేయటమా.. లేక, వచ్చే ఆర్దిక సంవత్సరంలో అమలు చేస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications