ప్రేమించి పెళ్ళిచేసుకొన్నాడు, అనుమానంతో ఇలా....
ప్రేమించి మతాతంతర వివాహం చేసుకొన్న యువకుడే అనుమానంతో భార్యపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకొంది.
తెనాలి:ప్రేమించి మతాతంతర వివాహం చేసుకొన్న యువకుడే అనుమానంతో భార్యపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకొంది.
గుంటూరు పట్టణంలోని నందులపేట భాస్కర్ రావు దిబ్బకు చెందిన స్వర్ణకారుడు మానేపల్లి బ్రహ్మం 9 ఏళ్ళ క్రితం తెనాలి రూరల్ మండలానికి చెందిన షేక్ రిజ్వానా అలియాస్ పద్మను ప్రేమించి పెళ్ళిచేసుకొన్నాడు.

వీరిక ఏడేళ్ళ కుమార్తై కూడ ఉంది. రిజ్వానా తరచూ ఫోన్ మాట్లాడుతుండడంపై అతడికి అనుమానపడ్డాడు.ఈ విషయమై ఆయన ఆమెతో గొడవపడ్డాడు. శనివారం నాడు రిజ్వానాను డాబాపైకి తీసుకెళ్ళి తనతోపాటు తెచ్చుకొన్న యాసిడ్ ను ఆమె ముఖంపై పోశాడు.
యాసిడ్ ముఖం నుండి కిందకు కారి ఒళ్ళంతా కాలిపోయింది. రిజ్వానా పెద్దగా కేకలు వేస్తూ కిందకు రావడంతో స్థానికులు ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఆమెను మెరుగైన చికిత్స కోసం గుంటూరు ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి బంధువల ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బ్రహ్మం ద్విచక్ర వాహనంపై పారిపోయాడు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications