పవన్ కల్యాణ్ కు, నాకు గ్యాప్ రావడానికి వారే కారణం: అలీ
పవన్ కల్యాణ్ కు, తనకు ఎటువంటి విభేదాలు లేవని, తమ మధ్య గ్యాప్ లేదని సినీ నటుడు అలీ వ్యాఖ్యానించారు. కొందరు వెబ్ సైట్ వాళ్లు మసాలా కోసం అలా క్రియేట్ చేశారన్నారు. ప్రతి సోమవారం 'ఈటీవీ'లో ప్రసారమవుతున్న 'అలీతో సరదాగా' కార్యక్రమానికి అతిథిగా అలీయే వచ్చారు. యాంకర్ సుమ ఆయన్ని ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు అలీ సమాధానమిచ్చారు.
తన కుమార్తె వివాహానికి ఆహ్వానించడానికి ఆయన నటిస్తున్న సినిమా సెట్ కు వెళ్లానన్నారు. విషయం తెలుసుకొని తనదగ్గరకు వచ్చారని, అదే సమయంలో వారేవాళ్లు పవన్ ను కలవడానికి వస్తే వారిని వెయిట్ చేయించారని వెల్లడించారు. మొదట తనదగ్గరకు వచ్చారని, అప్పుడు ఇద్దరం 15 నిముషాలు మాట్లాడుకున్నామన్నారు. ఈ విషయం వెబ్ లో రాసేవారికి తెలియదు. అందరూ ఆసక్తిగా చూస్తారని ఏదో రాస్తే ఎవరూ చూడరన్నారు. అక్కడ ఏమీ విషయం ఉండదన్నారు. వివాహానికి వస్తానని పవన్ చెప్పారని, ఎక్కాల్సిన విమానం మిస్సవడంతో రాలేకపోయారని చెప్పారు. దీంతో ఎవరు పడితే వారు ఇష్టమొచ్చిన రీతిలో రాశారని, అంతేకానీ తమ మధ్య ఎటువంటి గ్యాప్ లేదన్నారు.

ఆదరణ పొందిన ఈ షోను కొంతకాలం ఆపేస్తున్నారు. ఈ సందర్భంగా అలీనే ప్రత్యేక అతిథిగా వచ్చారు. కొంతకాలం తర్వాత మళ్లీ తిరిగి ప్రారంభిస్తామని అలీ చెప్పారు. దాదాపుగా 6 సంవత్సరాలు ఈ షో కొనసాగింది. కృష్ణంరాజు ఈ షో చేస్తున్నందుకు తనను మెచ్చుకునేవారని, కృష్ణ, కృష్ణంరాజుతో కలిసి ఒక షో చేయాలనుకున్నప్పటికీ కరోనా వల్ల కుదరలేదన్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు... ఈ ఐదుగురు సినీ పరిశ్రమకు పంచ భూతాల్లాంటివారని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications