మనిషివా.. మోడీవా, బాబుకు చెప్పా, ఆమరణదీక్ష: శివాజీ సంచలనం, తెరపైకి కొత్త డిమాండ్

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై నటుడు, హోదా సాధనా సమితి నేత శివాజీ కేంద్రానికి అల్టిమేటం జారీ చేశారు. పార్లమెంటు సమావేశాలు పూర్తయ్యేలోగా హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

చదవండి: తెలంగాణని లాగి జైట్లీపై బాబు తీవ్రంగా, మారుతున్న పరిణామాలు: జగన్‌కు బీజేపీ కితాబు

  వెంకయ్య, గవర్నర్ రాష్ట్రానికి పట్టిన దరిద్రం

  ఆలోగా హామీని నెరవేర్చకుంటే తాను ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని కేంద్రానికి హెచ్చరికలు జారీ చేశారు. ఏపీకి జరిగిన అన్యాయం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీపై ఆయన మండిపడ్డారు.

  చదవండి: మీ అన్నయ్య పార్టీని అడుగు, జగన్ బతికించారు, ఇన్నాళ్లేం చేశావ్: పవన్ డైలాగ్‌తో రోజా

  మనిషివా, మోడీవా అని ప్రశ్నిద్దామా

  మనిషివా, మోడీవా అని ప్రశ్నిద్దామా

  ఆంధ్రప్రదేశ్ ప్రజలను ప్రధానమంత్రి మోడీ మోసం చేశారని శివాజీ ఆరోపించారు. నమ్మించి మోసం చేస్తే నమ్మకద్రోహం అవుతుందన్నారు. మోసం చేసిన వారని ఇక నుంచి మనిషివా, మోడీవా అని ప్రశ్నిద్దామా అన్నారు.

  చంద్రబాబును ముందే హెచ్చరించాం

  చంద్రబాబును ముందే హెచ్చరించాం

  నాడు ఏపీకి హోదా కోసం రాజ్యసభలో పోరాడిన, ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుపై కూడా శివాజీ నిప్పులు చెరిగారు. హోదా బదులు చంద్రబాబు ప్యాకేజీని అంగీకరించిన సమయంలోనే.. వెంకయ్య మోసం చేస్తారని తాము ముందే సీఎంను హెచ్చరించామని తెలిపారు.

  తెలుగు ప్రజలు తెలివైనవారు

  తెలుగు ప్రజలు తెలివైనవారు

  ఏపీకి న్యాయం జరగాలని తాము చేసే పోరాటం తమ కోసం కాదని శివాజీ అన్నారు. భావి తరాల కోసం తాము ఉద్యమిస్తున్నామని చెప్పారు. తెలుగు ప్రజలు చాలా తెలివైనవారని, మోసం చేసిన వారికి తగిన బుద్ధి చెబుతారన్నారు.

  ఏ రాష్ట్రం పన్నులు ఆ రాష్ట్రానికే ఖర్చు చేయాలి

  ఏ రాష్ట్రం పన్నులు ఆ రాష్ట్రానికే ఖర్చు చేయాలి

  ఈ సందర్భంగా నటుడు శివాజీ మరో కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఇప్పటికే చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ఉత్తరాది పెత్తనమని, దక్షిణాది సొమ్ములతో ఉత్తరాదిని అభివృద్ధి చేస్తున్నారని ఆరోపించారు. తాజాగా శివాజీ మాట్లాడుతూ... కేంద్రానికి రాష్ట్రాలు కట్టిన పన్నులను, ఆ రాష్ట్రాలకే ప్రభుత్వం ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు.

  చంద్రబాబు బయటకు రావాలని రామకృష్ణ

  చంద్రబాబు బయటకు రావాలని రామకృష్ణ

  మంత్రి పదవులు వదులుకున్న టీడీపీ ఎన్డీయే నుంచి కూడా బయటకు రావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వేరుగా అన్నారు. టీడీపీ హోదా కోసం ఉద్యమించాలన్నారు. ఏపీకి జరిగిన అన్యాయంపై రాష్ట్ర బీజేపీ నేతలు మాట్లాడక పోవడం బాధాకరమన్నారు. రైల్వే జోన్ రాజకీయ నిర్ణయం అనడం సిగ్గుచేటు అన్నారు. ఎప్పుడు రాయలసీమ గురించి మాట్లాడని బీజేపీ నేతలు ఇప్పుడు రెండో రాజధాని కోరడం విడ్డూరమని, చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి అన్ని పార్టీల మద్దతు కూడగట్టాలన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Actor Sivaji on Tuesday upped his ante against Bharatiya Janata Party saying that the party had gone back on its commitment to Andhra Pradesh by not grating special status.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి