తెలంగాణని లాగి జైట్లీపై బాబు తీవ్రంగా, మారుతున్న పరిణామాలు: జగన్‌కు బీజేపీ కితాబు

అమరావతి: ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై, బీజేపీ నేతలపై ఏపీ సీఎం టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగానే స్పందిస్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలపై సోమవారం మరోసారి ఆగ్రహించారు.

చదవండి: బాబు వల్లే కియా వచ్చిందని గొప్పలు, భయపడ్డారు: మాణిక్యాల రావు తీవ్రవ్యాఖ్యలు

సెంటిమెంటుకు డబ్బులు రావని జైట్లీ చెబుతున్నారని, ఆ సెంటుమెంటుతోనే తెలంగాణ ఇచ్చారనే విషయం మరిచిపోవద్దని ముఖ్యమంత్రి విమర్శించారు. అరవై సంవత్సరాలు కలిసి ఉన్నామన్నారు. హైదరాబాదులాగే అమరావతిని అభివృద్ధి చేస్తానని చెప్పారు.

చదవండి: రైల్వే జోన్ ఇవ్వలేం, ఏపీకి మరో షాక్: చేతలెత్తేసిన కేంద్రం, పుండు మీద కారం

సెంటిమెంటుతో విభజించినప్పుడు ఇది తప్పేమిటి

సెంటిమెంటుతో విభజించినప్పుడు ఇది తప్పేమిటి

హైదరాబాదును తానే అభివృద్ధి చేశానని చంద్రబాబు చెప్పారు. తెలుగు వారి కోసం అభివృద్ధి చేశానని, ఇప్పుడు అమరావతిని అలాగే చేస్తానని చెప్పారు. సెంటిమెంటుతో రాష్ట్రాన్ని విభజించినప్పుడు అదే సెంటిమెంటుతో ఇచ్చిన హామీలు ఇస్తే తప్పేమిటని ప్రశ్నించారు.

ఏం ఇచ్చారు, ఏం ఇవ్వలేదో చూసుకోవాలి

ఏం ఇచ్చారు, ఏం ఇవ్వలేదో చూసుకోవాలి

ప్రజల సెంటుమెంటును గౌరవించాల్సిన బాధ్యత మన పైన ఉందని చంద్రబాబు అన్నారు. కేంద్రం విభజన బిల్లులు, ఇచ్చిన హామీలను సమీక్షించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఏం ఇచ్చారు, ఏం ఇవ్వలేదు అని చూసుకొని, ఇవ్వని వాటికి కాలపరిమితి చెప్పాలన్నారు.

జగన్‌పై విష్ణు, మోడీపై విజయ సాయిరెడ్డి

జగన్‌పై విష్ణు, మోడీపై విజయ సాయిరెడ్డి

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీపై నమ్మకం ఉందని వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి అంటే, ఏపీలో వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆదరణ పెరుగుతోందని బీజేపీ శాసన సభా పక్ష విష్ణు కుమార్ రెడ్డి అన్నారు. ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

బీజేపీ-టీడీపీ మధ్య... టీడీపీ టార్గెట్

బీజేపీ-టీడీపీ మధ్య... టీడీపీ టార్గెట్

కేంద్రంలోని బీజేపీ నేతల విషయాన్ని పక్కన పెడితే, ఏపీ బీజేపీ నేతలు, వైసీపీ దగ్గరవుతున్నట్లుగా టీడీపీ నేతలు భావిస్తున్నారు. దీంతో బీజేపీ-వైసీపీ మధ్య ఉన్న రహస్య ఒప్పందాన్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు చెప్పాలని టీడీపీ భావిస్తోంది. ఇందులో భాగంగా టీడీపీ నేతలు బీజేపీ, వైసీపీని టార్గెట్ చేస్తున్నాయి. తెర వెనుక వారి మధ్య ఏదో ఉందని భావిస్తున్నారు.

చంద్రబాబు పర్యటన

చంద్రబాబు పర్యటన

అసెంబ్లీ సమావేశాల అనంతరం చంద్రబాబు రాష్ట్రంలో పర్యటించాలని యోచిస్తున్నారు. ఈ సమయంలో బీజేపీ- వైసీపీ మధ్య ఏదో ఉందనే విషయం ప్రజలకు చెప్పనున్నారని తెలుస్తోంది. ఆయన ప్రతి జిల్లాలో పర్యటించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+