ప్రియుడి కోసం కొడుకుపై శాడిజం.. మర్మాంగాలపై బ్లేడుతో కోసిన తల్లి
సమాజంలో రోజురోజుకీ పెరుగుతున్న వివాహేతర సంబంధాలు హత్యలకు, ఆత్మహత్యలకు కారణం అవుతున్నాయి. ప్రియుడు మోజులో పడి భర్తను కడతేరుస్తున్న వారు, పిల్లలను చంపుతున్న వారు రోజురోజుకు పెరిగిపోతున్నారు. ఈ పరిస్థితులు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేస్తున్నాయి. తాజాగా అటువంటి ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.
కొడుకుపై తల్లి పైశాచికం
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కొడుకు పైన కన్నతల్లి దాడి చేసిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. ప్రియుడితో గడపటానికి కొడుకు అడ్డుగా ఉన్నాడని ఓ తల్లి దారుణ ఘటనకు పాల్పడింది. అత్యంత అమానవీయంగా, పైశాచికంగా ప్రవర్తించింది. నవ మాసాలు మోసి కని పెంచిన విషయాన్ని మరిచిపోయింది. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ మహిళ భర్త చనిపోవడంతో కొడుకుతో కలిసి జీవిస్తుంది.

ప్రియుడి రాకకు అడ్డుగా కొడుకు ఉన్నాడని ప్లాన్
ఈ క్రమంలో ఆమెకు రాజు అని మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో అతను ఆ మహిళ ఇంటికి వచ్చి వెళుతూ ఉండేవాడు. ఆమెతో ఏకాంతంగా గడపడానికి ఆమెకున్న ఏడేళ్ల కొడుకు ప్రియుడికి అడ్డుగా అనిపించాడు. దీంతో ఆ మహిళను కొడుకు వేదించమని, బాలుడు ఇంటి నుండి వెళ్ళిపోయేలా చేయాలని చెప్పాడు. అప్పుడు మనిద్దరం కలిసి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండొచ్చు అని చెప్పాడు.
కన్నకొడుకును చిత్రహింసలు పెట్టిన తల్లి
దీంతో ఆ మహిళ, ప్రియుడితో కలిసి కన్న కొడుకు ను చిత్రహింసలు పెట్టటం మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే నేడు ఆ మహిళ ప్రియుడు కలిసి బాలుడు పైన దాడి చేశారు. బ్లేడ్ తో ఇష్టమొచ్చినట్టు శరీరమంతా గాయపరిచారు. చివరకు ప్రైవేట్ పార్ట్స్ పైన కూడా బ్లేడ్ తో గాయాలు చేశారు. వీరి వేధింపులను తట్టుకోలేక బాలుడు గట్టిగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగు జనం అక్కడికి వచ్చారు.
కేసు నమోదు.. బాలుడు ఆస్పత్రిలో చేరిక
శరీరమంతా గాయాలతో రక్తమోడుతున్న బాలుడిని చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాలీవుడ్ ఆసుపత్రిలో తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన పైన కేసు నమోదు చేసుకొని వారిరువురిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. స్థానికులు కన్నతల్లిలా కాకుండా కసాయి దానిలా ప్రవర్తించిన తల్లి పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications