రైల్వే జోన్ ఇవ్వలేం, ఏపీకి మరో షాక్: చేతలెత్తేసిన కేంద్రం, పుండు మీద కారం

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదని, దానిని ఇవ్వలేమన తేల్చి చెప్పిన కేంద్రం తాజాగా, సోమవారం మరో షాకిచ్చినట్లుగా తెలుస్తోంది. విశాఖపట్నం రైల్వే జోన్ ఇవ్వలేమని సోమవారం కేంద్ర హోంశాఖ చెప్పిందని సమాచారం.

బాబు వల్లే కియా వచ్చిందని గొప్పలు, భయపడ్డారు: మాణిక్యాల రావు తీవ్రవ్యాఖ్యలు

ప్రత్యేక హోదా కోసం ఇప్పటికే ఏపీలో ఉద్యమాలు జరుగుతున్నాయి. హోదా తర్వాత అందరి చూపు రైల్వే జోన్ పైన ఉంది. హోదా రాకపోయినప్పటికీ ఇది మాత్రం కచ్చితంగా వస్తుందని అందరూ భావిస్తున్నారు. కానీ ఈ విషయంలోను చేదు ఎదురు కానుందని తెలుస్తోంది.

 రైల్వే జోన్‌పై చేతులెత్తేసిన కేంద్రం

రైల్వే జోన్‌పై చేతులెత్తేసిన కేంద్రం

సోమవారం సాయంత్రం ఏపీకి రైల్వే జోన్ విషయంలో కేంద్రం తేల్చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఏపీకి రైల్వే జోన్ ఇవ్వమని తేల్చేసిందని సమాచారం. ఇది సాధ్యం కాదని ఆంధ్రప్రదేశ్ సీఎస్ దినేష్ కుమార్‌కు కేంద్ర హోంశాఖ కార్యదర్శి స్పష్టం చేశారు. ప్రస్తుతం 13వ షెడ్యూల్ పైన ఇరు రాష్ట్రాల అధికారులతో జరుగుతున్నాయి.

 ఏపీ ప్రజల ఆశలపై నిళ్లు

ఏపీ ప్రజల ఆశలపై నిళ్లు

హోదా విషయాన్ని పక్కన పెడితే రైల్వే జోన్ పైన అందరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ ఆశలపై ఇప్పుడు నీళ్లు చల్లిందని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విశాఖ రైల్వే జోన్ సాధ్యం కాదని ఏపీ సీఎస్‌కు చెప్పినట్లుగా తెలుస్తోంది.

రైల్వే జోన్ వస్తుందని బీజేపీ నేతలు ఇలా

రైల్వే జోన్ వస్తుందని బీజేపీ నేతలు ఇలా

తమకు అందుబాటులో ఉన్న నివేదిక ప్రకారం రైల్వే జోన్ ఇవ్వలేమని తేల్చి చెప్పిందని సమాచారం. ఏపీకి హోదా ఇవ్వలేకపోయినప్పటికీ దానికి సమానమైన ప్యాకేజీ, విశాఖ రైల్వే జోన్ ఇస్తామని బీజేపీ నేతలు చెబుతూ వస్తున్నారు. కానీ ఇప్పుడు అది కూడా లేనట్లేనని అంటున్నారు.

 ఇటీవలే చెప్పారు

ఇటీవలే చెప్పారు

విశాఖకు ఎట్టి పరిస్థితుల్లో, వంద శాతం రైల్వే జోన్ తీసుకు వస్తామని ఇటీవల అసెంబ్లీలో బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు చెప్పారు. ఇది 25 ఏళ్ల డిమాండ్ అన్నారు. అయితే హోదా తర్వాత రైల్వే జోన్ అంశంపై కేంద్రం ఏపీకి మరో షాకిచ్చింది.

పుండు మీద కారం

పుండు మీద కారం

రైల్వే జోన్ ఇస్తామని, ఒడిశాతో చర్చలు జరిపి పరిధిని కుదించి విశాఖ రైల్వే జోన్ కేటాయిస్తామని ఇటీవలే కేంద్రం చెప్పింది. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో రైల్వే జోన్ ఇవ్వడం సాధ్యం కాదని అంటుండటం గమనార్హం. ఇది పుండు మీద కారం చల్లినట్లే అంటున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is said that No railway zone for Andhra Pradesh in Vishakapatnam.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి