66 ఏళ్ల వయసులో ఆ నటి తల్లి కాబోతుందా ???
హిందీ సినీ పరిశ్రమలో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన సీనియర్ నటి "నీనా గుప్తా". దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న ఆమె.. సహజమైన నటనతోనే కాకుండా వివాదాలతో కూడా నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. 1980లలో కెరీర్ ప్రారంభించిన ఆమె ఇప్పటికీ సినిమాలు, వెబ్ సిరీస్‌లలో చురుకుగా నటిస్తూ యువ నటీమణులకు పోటీగా నిలుస్తున్నారు. ఈమె 1982లో విడుదలైన Saath Saath చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టారు. హిందీతో పాటు మలయాళం, ఒడియా చిత్రాల్లో కూడా ఆమె నటించారు. సినిమాలతో పాటు టెలివిజన్ సీరియల్స్, వెబ్ సిరీస్‌లలో కూడా ఆమె నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.
తన కెరీర్‌లో Neena Gupta అనేక గుర్తింపు పొందిన చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా Badhaai Ho చిత్రంలో ఆమె నటనకు విపరీతమైన ప్రశంసలు వచ్చాయి. ఆ సినిమాలో ఆమె పోషించిన పాత్రకు జాతీయ స్థాయిలో కూడా ప్రశంసలు లభించాయి. ఇటీవల వచ్చిన Uunchai వంటి చిత్రాల్లో కూడా నటించి అలరించారు. సినిమాలతో పాటు Neena Gupta వ్యక్తిగత జీవితం కూడా తరచూ వార్తల్లో నిలుస్తూ వచ్చింది. ఇటీవల టాలీవుడ్ నటులు Vijay Deverakonda, Rashmika Mandanna వివాహ వేడుకలకు హాజరైన సందర్భంగా తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వేడుకలో Neena Gupta కూడా పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. అయితే ఆ ఫోటోలలో ఆమె కాస్త బొద్దుగా కనిపించడంతో సోషల్ మీడియాలో వింత పుకార్లు మొదలయ్యాయి.

గర్భం దాల్చిందా ?
అయితే సదరు ఫోటోల్లో ఆమె పొట్ట భాగం కాస్త ఉబ్బుగా కనిపించడంతో కొంతమంది నెటిజన్లు అది బేబీ బంప్ అని ప్రచారం చేశారు. దీంతో 66 ఏళ్ల వయసులోనే Neena Gupta తల్లికాబోతుందా అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ వెల్లువెత్తాయి. ఈ పుకార్లు వేగంగా వ్యాపించి పెద్ద చర్చకు దారి తీసాయి. ఈ వార్తలపై చివరకు Neena Gupta స్వయంగా స్పందించారు.
ఒక జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. తాను గర్భవతి కాదని స్పష్టం చేశారు. ఆ కార్యక్రమంలో తాను ధరించిన ఐవరీ చీర ఫ్యాబ్రిక్ మందంగా ఉండటంతో కాస్త బొద్దుగా కనిపించానని చెప్పారు. ఆమె మాట్లాడుతూ.. తాను గర్భవతిని కాదని.. చీర ఫ్యాబ్రిక్ కారణంగా అలా కనిపించిందని చెప్పుకొచ్చారు.
అలానే గతంలో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం Viv Richardsతో ఆమె ప్రేమ వ్యవహారం ఒకప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. ఆ సంబంధం వల్లే ఆమె కుమార్తె Masaba Gupta జన్మించారు. మరోవైపు సమాజంలో మహిళల హక్కులు, సమానత్వం, మహిళా సాధికారత వంటి అంశాలపై కూడా Neena Gupta తరచూ తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు. కొద్ది రోజుల క్రితం కన్యత్వ పరీక్షల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసాయి.












Click it and Unblock the Notifications