అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు

ఇరాన్ యుద్ధం కారణంగా దేశంలో వంటగ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. దేశంలోని వివిధ నగరాల్లో వంటగ్యాస్ కొరత తీవ్రమైంది. డొమెస్టిక్, కమర్షియల్ అనే తేడా ఏదీ ఉండట్లేదు. అన్ని వర్గాల వారి మీదా దీని ప్రభావం పడింది. హోటళ్ల యజమానులు ఏకంగా సెలవులను ఇచ్చుకునే పరిస్థితి తలెత్తిందంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి తలెత్తింది. వంట వండటానికి ఇతర వనరులపై ఆధారపడాల్సి వస్తోంది.

ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రజలు గ్యాస్‌కు బదులుగా వినూత్నమైన ప్రత్యామ్నాయ పరిష్కారాలను వెతుకుతున్నారు. కొందరు పొయ్యిలను, మరికొందరు ఇండక్షన్ స్టవ్‌లను ఆశ్రయిస్తుండగా, ఇంకొందరు నివ్వెరపరిచే ప్రయోగాలు చేస్తున్నారు. చిన్న స్థాయి హోటళ్లు సైతం కట్టెల పొయ్యికి మారడం మొదలుపెట్టాయి. గ్యాస్ సిలిండర్ల నుండి పొయ్యిలకు మారుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.

Humor Meets Ingenuity Social Media Buzzes with Hilarious Jugaad as Cooking Gas Runs Low in India

అనేక హోటల్ యజమానులు సాంప్రదాయ కల్టెల పొయ్యిని కట్టుకుంటోన్నారు. గ్యాస్ లేకున్నా వంట వండటానికి పొయ్యిని నిర్మిస్తోండటం కనిపించింది. ప్రియా సింగ్ అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను ట్వీట్ చేశారు. ఆత్మనిర్భర్ భారత్ పునాదులు పడ్డాయని వ్యాఖ్యానించారు. ఇకపై గ్యాస్ సిలిండర్లకు బదులుగా పొయ్యిపై వండిన ఆహారాన్ని ఈ హోటల్ లో లభిస్తుందని ఆమె ఫన్నీగా కామెంట్స్ చేశారు. దీనికి అదే రేంజ్ లో రిప్లైలు పడుతున్నాయి.

మరో వీడియోలో ఓ కంపెనీలలో పనిచేస్తున్న కార్మికులు గ్యాస్ లేకపోవడంతో పొయ్యిలపై వంటలు చేసుకోవడం కనిపించింది. పలువురు కార్మికులు ఒకరి తర్వాత ఒకరు వరుసగా పొయ్యిలను వెలిగించి తమ ఆహారాన్ని సిద్ధం చేసుకుంటుండటం ఈ వీడియోలో చూడొచ్చు. ఆనంద్ యాదవ్ అనే అడ్వకేట్ దీన్ని ట్వీట్ చేశారు. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌లు లభించకపోవడంతో ఎల్‌ అండ్ టీ కంపెనీలో పనిచేసే కార్మికులు, యూపీ, బీహార్‌కు చెందిన ప్రజలు తమ ఇంటి బయట సాంప్రదాయ పద్ధతిలో పొయ్యిలను వెలిగించి వంట చేసుకుంటున్నారని తెలిపారు.

దీనికితోడు సోషల్ మీడియా యూజర్లు గ్యాస్ కొరతను హాస్యాస్పదంగా చిత్రీకరించే కంటెంట్‌ను కూడా రూపొందిస్తున్నారు. ఓ వ్యక్తి ఇస్త్రీ పెట్టెను పెనంగా మార్చాడు. వంటకు ప్రత్యామ్నాయంగా వాటర్ ఇమ్మర్షన్ రాడ్‌తో వంట చేస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఒక గిన్నెలో ఇమ్మర్షన్ రాడ్‌తో సాంబార్ ను ఉడికిస్తున్న వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది. మరో వీడియోలో- ఒక వ్యక్తి ఒకే కడాయిని మూడు భాగాలు చేసి అన్నం, కూర, బజ్జీలను తయారు చేయడం చూడొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+