అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!!

ఏపీలోని రైతులకు బిగ్ అలర్ట్. ప్రభుత్వం తాజాగా మూడో విడత అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేసింది. కేంద్రం పీఎం కిసాన్ కింద విడుదల చేసిన రూ 2 వేలు.. ఏపీ ప్రభుత్వం ఈ పథకం కింద జమ చేసిన రూ 4 వేలతో ఒకే సారి రైతుల ఖాతాల్లో రూ 6 వేలు అర్హత ఉన్న ప్రతీ రైతు ఖాతాల్లో చేరాయి. అయితే, ఇప్పటికీ నిధులు జమ కాని రైతుల కోసం అధికారులు కీలక సూచనలు చేస్తున్నారు. వారి నిధుల జమ స్థితిని తెలుసుకోవటంతో పాటుగా... ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పించారు.

ఏపీలోని రైతులకు ఒకే సారి రూ 6 వేలు వారి ఖాతాల్లో జమ అయ్యాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతీ రైతుకు రూ 20 వేలు అందాల్సి ఉంది. కేంద్రం పీఎం కిసాన్ పథకం కింద ప్రతీ ఏటా రూ 6 వేలు మూడు విడతల్లో అందిస్తోంది. ఈ పథకం నిధులతో పాటుగానే ఏపీ ప్రభుత్వం మూడు విడతల్లో రూ 14 వేలు విడుదల చేస్తోంది. అందులో భాగంగా ఈ నెల 13న కేంద్రం రూ 2 వేలు.. ఏపీ ప్రభుత్వం రూ 4 వేలు విడుదల చేసాయి. దీని ద్వారా ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో అర్హత ఉన్న ప్రతీ రైతు ఖాతాల్లో రూ 20 వేలు జమ పూర్తయింది. అయితే, ఏపీ ప్రభుత్వం అందిస్తున్న అన్నదాత సుఖీభవ నిధులు అర్హత ఉండీ.. జమ కాకుంటే ఏ విధంగా చెక్ చేసుకోవాలో.. అధికారులు సూచిస్తున్నారు. మూడో విడత కింద ప్రభుత్వం మొత్తం 6.85 లక్షల మంది రైతులకు రూ.6 వేల చొప్పున రిలీజ్ చేసింది. ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పేరుతో వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది.

annadata-sukhibava-funds-if-not-credited-follow-these-steps-to-know-the-status-also-complaint-to-th

నిధులు జమ కాకుంటే ఫిర్యాదు చేసే అవకాశం

ఈ పోర్టల్‌లోకి వెళ్లి స్టేటస్ సులువుగా చెక్ చేసుకోవచ్చు. అలాగే అన్నదాత సుఖీభవ మొబైల్ యాప్ కూడా అందుబాటులో ఉంది. యాప్ ద్వారా కూడా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం రైతు లు ముందుగా https://annadathasukhibhava.ap.gov.in వెబ్‌సైట్లోకి వెళ్లి హోమ్ పేజీలో Know Your Status అనే ఆప్షన్ ఎంచుకోవాలి. తర్వాత ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సెర్చ్ బటన్‌పై క్లిక్ చేయటం ద్వారా.. పేమెంట్ వివరాలు అక్కడ కనిపిస్తాయి. అదే విధంగా ఈకేవైసీ యాక్టివ్‌లో ఉందా.. లేదా వివరాలు కూడా అక్కడ తెలుస్తాయి. ఆ సమయంలో డబ్బలు పడకపోతే రైతు సేవా కేంద్రంలో సంప్రదించాలని సూచిస్తున్నారు. అదే విధంగా గ్రామ, వార్డు సచివాలయంలో కూడా అధికారులను అడిగి సమస్య తెలుసుకోవచ్చు. టోల్ ఫ్రీ నెంబర్‌ను అందుబాటులోకి తెచ్చారు. 155251 నెంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయటం తో పాటుగా అర్హత ఉండి అందకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+