"ఈ నెల 20వరకూ బతికే ఉంటా"- సోనమ్ వాంగ్ చుక్..! డాక్టర్ల హెచ్చరికలు..!

నీట్ సహా జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ (Sonam Wangchuk)చేస్తున్న నిరాహార దీక్ష 20వ రోజూ కొనసాగుతోంది. ఆయన ఆరోగ్యం నానాటికీ క్షీణిస్తోంది. ఇప్పటికే 10 కేజీలకు పైగా బరువు తగ్గిపోవడంతో పాటు కీలక అవయవాలపై ఆ ప్రభావం పడుతోంది. దీంతో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు .. పరిస్ధితి విషమంగా ఉందని హెచ్చరించారు.

Sonam Wangchuk: సోనమ్ వాంగ్ చుక్ పై తేల్చేసిన కేంద్రం- ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు..!
Sonam Wangchuk: సోనమ్ వాంగ్ చుక్ పై తేల్చేసిన కేంద్రం- ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు..!

అయితే తాను పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యే ఈ నెల 20వ తేదీ వరకే బతికే ఉంటానని సోనమ్ వాంగ్ చుక్ ప్రకటించారు.
ఇవాళ జంతర్ మంతర్ నిరసన ప్రాంతంలో మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. వాంగ్‌చుక్ తన శారీరక పరిస్థితి క్షీణిస్తున్నప్పటికీ, తన సంకల్పం మాత్రం చెక్కుచెదరలేదని అన్నారు. మరోవైపు జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకారులపై పోలీసుల అనుచిత నిఘాకు వ్యతిరేకంగా దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సోమవారం విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు అంగీకరించింది.

Sonam Wangchuk Says He Will Stay Alive Till July 20 as Hunger Strike Enters Critical Stage
విద్యామంత్రిగా సోనమ్ వాంగ్ చుక్-కేజ్రివాల్ డిమాండ్-పెరుగుతున్న మద్దతు..!
విద్యామంత్రిగా సోనమ్ వాంగ్ చుక్-కేజ్రివాల్ డిమాండ్-పెరుగుతున్న మద్దతు..!

జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షురాలు ఐషే ఘోష్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో, ఢిల్లీ పోలీసులు ఒక శాశ్వత నిఘా టవర్‌ పెట్టి నిర్వహించడాన్ని, నిరసనకారులను రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు తీయడాన్ని సవాలు చేశారు. సుదీర్ఘ నిరాహార దీక్ష కారణంగా సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం విషమ దశకు చేరుకుందని, తదుపరి దశ ఆందోళనకరంగా మారి ఆయన అవయవాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని వైద్యులు ఇవాళ హెచ్చరించారు; అదే సమయంలో ఆయన దీక్షను విరమించాలంటూ పలు వర్గాల నుంచి విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+