బాబు వల్లే కియా వచ్చిందని గొప్పలు, భయపడ్డారు: మాణిక్యాల రావు తీవ్రవ్యాఖ్యలు

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఏపీ కేబినెట్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు, కేంద్ర కేబినెట్ నుంచి టీడీపీ ఎంపీలు బయటకు వచ్చా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇరు పార్టీల మధ్య ప్రత్యక్ష మాటల యుద్ధం సాగుతోంది. కేంద్రం ఏం చేయలేదని టీడీపీ చెబుతుండగా, మోడీ ప్రభుత్వం సహకరిస్తోందని బీజేపీ చెబుతోంది.

మోడీ! చంద్రబాబు గొంతు విన్నారా, ఇంకా అర్థం చేసుకోలే, శాస్తి తప్పదు: మమత నిప్పులు

తాజాగా, సోమవారం బీజేపీ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాల రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీకి పెట్టుబడులు చంద్రబాబు వల్లే వస్తున్నాయని టీడీపీ నేతలు చెబుతుంటారు. మాణిక్యాల రావు దానికి కౌంటర్ ఇచ్చారు.

మోడీ వల్లే పెట్టుబడులు

మోడీ వల్లే పెట్టుబడులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వల్ల పెట్టుబడులు రాలేదని, ప్రధాని నరేంద్ర మోడీ వల్లే వచ్చాయని మాణిక్యాల రావు చెప్పారు. పలు విదేశీ పర్యటనలు చేసిన ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు తెచ్చారో చెప్పాలని నిలదీశారు.

 ఎక్కడ ఎన్ని పరిశ్రమలు పెట్టారో చెప్పండి

ఎక్కడ ఎన్ని పరిశ్రమలు పెట్టారో చెప్పండి

ఎక్కడ ఎన్ని పరిశ్రమలు పెట్టారో చెప్పాలని టీడీపీ నేతలను మాణిక్యాల రావు నిలదీశారు. ఏపీకి కియా మోటార్స్ వచ్చిందని గొప్పలు చెబుతున్నారని, ఆ సంస్థ ఏపీకి రావడానికి కారణం నరేంద్ర మోడీ అన్నారు.

 భయపడి హోదా ఎత్తుకున్నారు

భయపడి హోదా ఎత్తుకున్నారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ప్రతిపక్షాలు ప్రజలలోకి వెళ్తుంటే అది చూసి భయపడిన చంద్రబాబు కూడా అదే నినాదాన్ని ఎత్తుకున్నారని మాణిక్యాల రావు విమర్శించారు.

వైదొలగినా ఎన్డీయేలోనే

వైదొలగినా ఎన్డీయేలోనే

కాగా, ఇటీవల బీజేపీ, టీడీపీ నేతల మధ్య పాక్షికంగా తెగదెంపులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఏపీ నుంచి బీజేపీ, కేంద్రం నుంచి టీడీపీ మంత్రులుగా వైదొలిగినప్పటికీ చంద్రబాబు ఎన్డీయేలో కొనసాగుతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Bharatiya Janata Party leader Pydikondala Manikyala Rao on monday said that investments comint to AP due to Prime Minister Narendra Modi.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి