భారీ బ్లాస్ట్.. 45 మంది మృతి.. 75 మందికి తీవ్ర గాయాలు

ఈశాన్య మయన్మార్ లో భారీ పేలుడు సంభవించింది. మైనింగ్ కోసం వినియోగించే పేలుడు పదార్థాలను నిల్వ ఉంచిన భవనంలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగింది. ఈ భారీ పేలుడు కారణంగా 45 మందికి పైగా మరణించారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. అలాగే 75 మందికి పైగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకూ 46 మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు. ఈ అగ్ని ప్రమాదం కారణంగా స్థానికంగా 100 కుపైగా ఇళ్లు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.

చైనా సరిహద్దుకు దక్షిణంగా కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న నామ్ కామ్ టౌన్ షిప్ లోని కౌంగ్ టూప్ గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఈ ప్రాంతం ప్రస్తుతం మయన్మార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న తాంగ్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ అనే సాయుధ తిరుగుబాటు సమూహం ఆధీనంలో ఉంది.

Myanmar Blast At Least 45 Killed and 70 Injured After Explosion at Mining Explosives Warehouse news

ప్రమాద సమయానికి ఈ భవనంలో పేలుడు పదార్థాలు ఉన్నప్పటికీ అసలు పేలుడు సంభవించడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+