వీడియో వైరల్: ఆలయ గర్భగుడిలో పూజారి పాడుపని.. మైనర్ బాలికతో కలిసి..!

ఆలయ గర్భగుడిలో అమానుషమైన ఘటన జరిగింది. గర్భగుడిలోకి మైనర్ బాలికను తీసుకెళ్లి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ పూజారి. ఈ షాకింగ్ ఘటన సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రామచంద్రపురం మార్కెట్ సమీపంలో ఓ చిన్న అమ్మవారి గుడిలో జరిగింది. ఈ ఘటన సమయంలో నిందితుడైన వృద్ధ పూజారిని రెడ్‌ హ్యాండెడ్‌ గా పట్టుకున్నారు స్థానికులు. వెంటనే మైనర్‌ బాలికను రక్షించి.. నిందితుడ్ని రామచంద్రాపురం పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. గతంలోనూ ఆలయంలో అసాంఘిక కార్యకలాపాలు జరిగాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని చెబుతున్నారు. స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారింది.

స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం.. రామచంద్రాపురంలో ఓ ఆలయంలోని గర్భగుడిలో షాకింగ్ ఘటన జరిగింది. ఆలయంలో సాయన్న అనే వృద్ధుడు అర్చకుడిగా పనిచేస్తున్నాడు. అయితే ఓ మైనర్ బాలికతో గర్భగుడిలో అర్చకుడు అనుచితంగా ప్రవర్తించసాగాడు. బాలికకు మాయమాటలు చెప్పి గుడిలోకి తీసుకుపోయి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దృశ్యాల్ని స్థానికులు గుర్తించారు. అదే సమయంలో ఆలయం బయటి నుంచి తాళం వేసి ఉండటంతో వారికి అనుమానం మరింత బలపడింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు.. గ్రామ పెద్దలు కలిసి ఆలయ తలుపులు తెరిచి చూశారు. ఆ సమయంలో బాలికతో పూజారి అసభ్యకరంగా ప్రవర్తిస్తూ కనిపించాడు. ఆగ్రహానికి గురైన స్థానికులు అతడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

priest sanctum Assault on minor the sanctum sanctorum Ramachandrapuram locals catch the video viral

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. బాలిక మైనర్ కావడంతో ఆమె వివరాలను గోప్యంగా ఉంచినట్లు పోలీసులు తెలిపారు. నిత్యం వందలమంది దర్శనానికి వచ్చే గర్భగుడిలో ఇలాంటి ఘటన జరగడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఈ ఆలయ ప్రాంగణంలో కొన్ని అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని వారు పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. మరోవైపు పోలీసులు ఈ ఘటనపై స్పందిస్తూ.. నిందితుడ్ని కఠినంగా శిక్షిస్తామని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+