Husharu Pittalu Movie Review: బోల్డ్ కంటెంట్‌తో మెప్పించిందా? యూత్‌కి కనెక్ట్ అయిందా?
Husharu Pittalu Movie Review: యూత్ లక్ష్యంగా బోల్డ్ అండ్ యూత్‌ఫుల్ కంటెంట్‌తో తెరకెక్కిన తాజా సినిమా 'హుషారు పిట్టలు'. ఏషియన్ సురేశ్ ఫిల్మ్స్ లాంటి ప్రసిద్ధ నిర్మాణ సంస్థ ఈ సినిమాను స్వయంగా విడుదల చేస్తుండటంతో మొదటి నుంచీ ప్రేక్షకుల దృష్టి ఈ చిత్రంపై పడింది. టీజర్, ట్రైలర్లతోనే సినిమా టోన్ ఏంటో స్పష్టంగా చెప్పేసిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని అందించిందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.
స్టోరీ
కథానాయకుడు రవి(అన్ష్) పదో తరగతిలో స్కూల్ ఫస్ట్ వచ్చిన ఓ టాలెంటెడ్ స్టూడెంట్. చదువు తప్ప మరో ధ్యాస లేని అతడిని ఓ గ్యాంగ్ అశ్లీల వీడియో చూపిస్తూ తప్పుడు దారిలోకి మళ్లిస్తారు. దీంతో బుక్స్ పక్కన పెట్టేసి అమ్మాయిలను పడేసే పనిలో పడతాడు. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన చిట్టి(వాసవి గణేశన్)ను ఇష్టపడతాడు. అతడిపై ఆకర్షణలో ఉన్న చిట్టి కూడా రవికి దగ్గరవుతుంది. అయితే పరిణతి లేని ఆ వయస్సులో వారిద్దరూ హద్దు దాటి ప్రవర్తిస్తారు. ఒకరోజు ఇలా కలిసి ఉండగా.. తల్లిదండ్రులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడతారు. తమ పిల్లలను ఆ స్థితిలో చూసి తల్లిదండ్రులు ఎలాంటి మానసిక వేదన అనుభవించారు.. ఆ బాధలో ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నారు? చిన్నవయసులో తెలిసీ తెలియక చేసిన తప్పు వారి జీవితాలను ఎటు తిప్పందనేదే మిగిలిన స్టోరీ.

కథ ఎలా సాగిందంటే..?
ఇది పూర్తిగా యువతను లక్ష్యంగా చేసుకుని రూపుదిద్దుకున్న సినిమా. ఈ సినిమా ఫస్టాఫ్‌లో చాలా భాగం అడల్ట్ కంటెంట్, డబుల్ మీనింగ్ డైలాగులతో నవ్వులు పూయించిన డైరెక్టర్.. క్లైమాక్సులో ఓ మంచి ఎమోషనల్ సందేశంతో ముగించాడు. ఫస్టాఫ్ లో రవి-చిట్టీల మధ్య పరిచయం, ఫోన్ ముచ్చట్లు, ఇద్దరు దగ్గరయ్యేందుకు వేసే ఎత్తుగడలు మంచి వినోదాన్ని పంచుతాయి. ఇక సెకండాఫ్ లో రవి-చిట్టీల గురించి తమ ఇంట్లో తెలియడం.. వారికి దొరికిపోవడంతో స్టోరీ కాస్తా సీరియస్ అవుతుంది. పిల్లలు తప్పుడు దారిలో వెళ్లడానికి తల్లిదండ్రుల ప్రవర్తన, అపరిమితమైన గారాబం, చెడు స్నేహాలు, సెల్ ఫోన్ వాడకం ఏ విధంగా కారణమవుతున్నాయో డైరెక్టర్ కళ్లకు కట్టినట్లు చూపించాడు. ఇక క్లైమాక్స్‌కు వచ్చేసరికి స్టోరీ భావోద్వేగపూరితంగా సాగుతుంది. అయితే చివర్లో ఉన్న సందేశం కోసం ఫ్యామిలీ ఆడియన్స్ ఈ స్థాయిలో ఉన్న అడల్ట్ కంటెంట్ ను స్వీకరిస్తారా లేదా అన్నదే ప్రశ్నగా మిగిలింది.
ఎవరెలా నటించారంటే?
ఈ చిత్రానికి రవి, చిట్టి పాత్రలే ప్రధాన బలంగా నిలిచాయి. అన్ష్, వాసవి తమ పాత్రల్లో చాలా సహజంగా నటించారు. రొమాంటిక్ సీన్లతో పాటు ద్వితీయార్థంలోని ఎమోషనల్ సీన్లలోనూ మెప్పించారు. ముఖ్యంగా వాసవి చెప్పా డైలాగులు, ఆమె చేసే హంగామా యువతను ఆకట్టుకుంటుంది. ఇక హీరోయిన్ తండ్రిగా గోవర్దన్స, హీరో తల్లిదండ్రులుగా సునీత, రమేష్ తమ పాత్ర మేరకు ఆకట్టుకున్నారు. ధగడ్ బాలు అనే పాత్ర మాత్రం నవ్వులు పూయిస్తుంది. సాంకేతికంగా చూస్తే చరణ్ అర్జున్ అందించిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. రుద్రసాయి సినిమాటోగ్రఫీ బాగుంది.
ఈ సినిమా ప్లస్ పాయింట్స్
అన్ష్, వాసవిల నటనతో పాటు కెమిస్ట్రీ అదిరిపోయింది. యూత్ ను ఆకట్టుకునే అంశాలు ఈ సినిమాకు ప్లస్ పాయింట్ గా నిలిచాయి. మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది.
ఈ సినిమా మైనస్ పాయింట్స్
మితిమీరిన అడల్ట్ కంటెంట్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఈ సినిమా అతిపెద్ద మైనస్. మరోవైపు సులభంగా ఊహించగలిగే కథ, కథనాలు కూడా మైనస్ గా నిలిచాయి.
ఫైనల్ గా ..
'హుషారు పిట్టలు'.. కేవలం యూత్ కోసం రూపొందించిన రొమాంటిక్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్!
*రేటింగ్: 2/5.














Click it and Unblock the Notifications